
జాతీయభావం నింపేందుకే తిరంగాయాత్ర
యాత్రను ప్రారంభించిన కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి
ఘట్‌కేసర్ టౌన్: యువతలో జాతీయ భావాన్ని నింపడానికే తిరంగాయాత్రను చేపడుతున్నట్లు కేంద్ర ఆహారశుద్ధి, పరిశ్రమల శాఖామంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు పసులాది చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలో తిరంగా జెండాను ఊపి శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుల గురించి యువతకు తెలియజెప్పడానికి దేశవ్యాప్తంగా తిరంగాయాత్రను చేపడుతున్నామన్నారు. నిజాం నిరంకుశపాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుండ్ల బాల్‌రాజ్ ముదిరాజ్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు బిక్కునాయక్, బీజేపీ జిల్లా కార్యదర్శి రామోజీ, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కంభం లక్ష్మారెడ్డి, ఎదుగని శ్రీరాములు, అచ్చిని రమేష్, ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి సగ్గు మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు పాండు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు అచ్చిని నర్సింహ, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రాంరతన్ శర్మ, రఘువర్ధన్‌రెడ్డి, స్థానిక శాఖ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు బాల్‌రాజ్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు బుచ్చయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షానూర్ పాషా, విజయ్ ముదిరాజ్, కృష్ణయాదవ్, పిట్టల విజయ్, శివ, అశోక్, అరవింద్, నరేష్ ముదిరాజ్, శ్రవణ్, రమేష్ పాల్గొన్నారు.