ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాధ్యుడు వనం నర్సింహ్మమాదిగ డిమాండ్ చేశారు.
ఘట్‌కేసర్ టౌన్: ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాధ్యుడు వనం నర్సింహ్మమాదిగ డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్ పట్టణంలోని శివారెడ్డిగూడ శ్రీ దండ్లగడ్డ వీరాంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఆ సంస్థ మండల అధ్యక్షుడు గంగి జగన్‌మాదిగ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టించడం కేవలం మంద కృష్ణమాదిగతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కమిటీలు వేసి పటిష్టం చేయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పెంపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్‌పై హామీ తప్పితే పెద్దఎత్తున ఉద్యమం లేవనెత్తుతామన్నారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రామేశ్వరం నరేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏనూతుల నాగేష్, వేముల యాదగిరి, నర్సింహ్మ, చినంగి కుమార్, కూరం మల్లేష్, మోతుకుపల్లి శ్రీనివాస్, పంగ నర్సింహ్మ, నక్క మల్లేష్, గార గిరి, వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు గ్యార బలరాం, జిల్లా నాయకుడు కొల్తూర్ జంగయ్య, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.