ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: పార్టీల మద్దతు, కుల, యువజన, మహిళా సంఘాల అండ... అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం... ‘స్థానిక’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బుధవారం మండలంలోని ఘట్‌కేసర్, ఎన్‌ఎఫ్‌సీ నగర్ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తిచేయగా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక శాసన సభ్యుడు కె.లక్ష్మారెడ్డి ఘట్‌కేసర్ ఎన్నికలను సవాలుగా తీసుకొని గల్లీ గల్లీకి తిరిగి ప్రచారం చేశారు. అయితే ఆయన టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయడం విశేషం. కాగా, ఇక్కడే టీడీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ నాయకుడు మద్దతు తెలపడం మరో విశేషం.
ఘట్‌కేసర్‌లో పోటాపోటీ...
ఘట్‌కేసర్ పంచాయతీ సర్పంచ్ పదవికి బండారి శ్రీనివాస్, అబ్బసాని యాదగిరి యాదవ్‌లు పోటీలో ఉన్నారు. ఇరువురూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. బండారి శ్రీనివాస్‌కు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తోంది. కాగా, కుల, యువజన సంఘాల మద్దతు తనకే ఉందని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి రాంరెడ్డి పార్టీ ఆదేశాలను పక్కనపెట్టి బండారి శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నారు. సస్పెండ్ చేస్తామని బెదిరించినా వెనక్కి తగ్గకుండా రాంరెడ్డి తన సతీమణిని సైతం ప్రచారానికి పంపారు. ఇక మరో అభ్యర్థి అబ్బసాని యాదగిరి టీఆర్‌ఎస్ మద్దతుతో రంగంలో ఉన్నారు. ఈయనకు బీజేపీ, సీపీఎంలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అయితే కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే కె.లకాష్మరెడ్డి స్వయంగా అబ్బసాని యాదగిరిని సర్పంచ్‌గా గెలిపించాలని ప్రచారం చేయడం విశేషం. ఎలాగో కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం అవుతుంది కాబట్టి అబ్బసాని యాదగిరికి మద్దతు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. ఆయనే రోజూ ఎన్నికల ప్రచార తీరును పరిశీలించడంతో పాటు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే సామాజిక వర్గాలను స్వయంగా కలిసి అబ్బసాని యాదగిరికి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఘట్‌కేసర్ పంచాయతీలో 18 వార్డు స్థానాలకు గాను 71మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో త్రిముఖ పోటీ...ఎన్‌ఎఫ్‌సీ నగర్ పంచాయతీలో 12 వార్డులు ఉండగా 43 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే సర్పంచ్ పదవి కోసం ముగ్గురు రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కనపాల రాజేష్, అలాగే కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు, టీడీపీ, బీజేపీల మద్దతుతో స్టీవెన్, పలు మహిళా సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా డీవీ రావు పోటీలో ఉన్నారు. కనపాల రాజేష్ గతంలో సర్పంచ్‌గా, ఆ తర్వాత ఆయన తల్లి పెర్సీబాయి సర్పంచ్‌గా పనిచేశారు. దాదాపు దశాబ్దకాలంగా వారి కుటుంబ సభ్యులే సర్పంచ్‌లుగా ఉన్నారు. చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రాజేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టీవెన్ ఎన్‌ఎఫ్‌సీ పరిశ్రమ విశ్రాంత ఉద్యోగి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, టీడీపీ, బీజేపీ అభిమానుల ఓట్లతో గెలుపొందుతానని స్టీవెన్ వి శ్వా„సంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్న డి.వి.రావు ఇంతకుముందు వార్డు సభ్యుడిగా పనిచేశారు. వృత్తిరీత్యా మేస్త్రీ కావడంతో గ్రామంలో తనకు ఉన్న పరిచయాలు ఓట్లుగా మారతయనే ధీమాతో ఉన్నారు.
ఘట్‌కేసర్‌లో పంచాయతీ ఎన్నికలు
Published Wed, Oct 9 2013 1:07 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement