ఘట్‌కేసర్: గత రెండు మూడేళ్లుగా జిల్లాలో నెలకొన్న అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిపెడుతున్నారు. వరి పంట వేసి ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నా.. కరెంటు, వర్షాలు అనుకూలించకపోవడంతో వీరు ప్రత్యామ్నాయ పంటలే మేలనే నిర్ణయానికి వచ్చారు.
అతివృష్టి, అనావృష్టిలతోపాటు క్రిమికీట కాలను తట్టుకొని నిలిచే కార్పెట్ గడ్డి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని అవుశాపూర్, అంకుశాపూర్, అన్నోజిగూడెం, ఏదులాబాద్ గ్రామాల్లో 300 ఎకరాల్లో కార్పెట్ గడ్డిని సాగు చేస్తున్నారు. ఒక ఏదులాబాద్ గ్రామంలోనే సుమారు వంద ఎకరాల్లో కార్పెట్ సాగవుతోదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కార్పెట్ గడ్డిని భవనాల చుట్టూ, పచ్చిక మైదానాల్లో, ఇళ్లు, కార్యాలయాలు తదితర చోట్ల విరివిగా వాడుతున్నారు. ఈ గడ్డితో పచ్చదనంతోపాటు అందం కూడా చేకూరడంతో ఇటీవల కాలంలో కార్పెట్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఎకరా విస్తీర్ణంలో కార్పెట్ గడ్డిని సాగు చేయడానికి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. కార్పెట్ గడ్డిని ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పెంచి కట్ చేస్తారు. రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుతో బిల్లల మాదిరిగా చేస్తారు. ఒక్కో బిల్ల నాణ్యతను బట్టి రూ.9 నుంచి రూ. 12 వరకు పలుకుతుంది.
ఎకరానికి సుమా రు 17,500 బిల్లలు వస్తే, వాటిని విక్రయించగా రూ. 1.50 లక్షల ఆదా యం వస్తుంది. ఖర్చులు పోనూ రైతుకు ఎకరాపై రూ. 60 వే ల నుంచి రూ. 70 వేల వరకు లాభాలు రావచ్చు. అయితే ఈ పంటలో కలుపుతీత కూడా ముఖ్యమైనదే. కలుపు తీయడానికి రైతుకు రోజుకు రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. మార్కెటింగ్‌లో ప్రావిణ్యత సా ధిస్తే కార్పెట్ సాగులో మంచి లాభాలు గడించవచ్చని రైతులు చెబుతున్నారు.
రెడ్ కార్పెట్ పరుస్తున్నారు..!
Published Sun, Aug 17 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement
Advertisement