Alternative crop
-
ఖరీఫ్ ప్రత్యామ్నాయం
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో ప్రధాన పంటలు వేసిన తర్వాత మిగిలిన భూముల్లో వర్షాధారంగా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేసుకోవచ్చునని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ జాన్‌సుధీర్ రైతులకు సూచించారు. చివరిగా కురిసే వర్షాలకు, తర్వాత చలి, మంచుకే ఈ పంట చేతికొస్తుందన్నారు. బలమైన పశుగ్రాసంతో పాటు రైతుకు ఆదాయాన్ని కూడా ఇస్తుందన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉలవ పంట వేసుకునేందుకు అనుకూలమని ఆయన తెలిపారు. విత్తనరకాలు, విత్తనశుద్ధి: పీడీఎం–1 అనే రకం 105 రోజుల పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. పీజడ్ఎం–1 రకం 90 నుంచి 95 రోజుల్లో పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. పీహెచ్‌జీ–62 రకం 85 రోజులకు వస్తుంది. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. పీహెచ్‌జీ–9 రకం 90 నుంచి 100 రోజులకు పూర్తవుతుంది. ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ మందుతో కలిపి విత్తనశుద్ధి చేయాలి. యాజమాన్యం: భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని తయారు చేసుకోవాలి. గొర్రుతో వరుసలో విత్తు పద్ధతిలో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు వేసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఎకరాకు 10 కిలోల యూరియా, 65 కిలోల సూపర్ పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరు దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి. విత్తిన 25 రోజుల నుంచి 35 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు దంతులతో కలుపు నివారణ చేసుకోవాలి పూత, పిందె ఏర్పడే సమయంలో కాయతొలిచే పురుగు పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు 2 మి.లీ క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. వాతావరణంలో అధిక తేమ ఉండి రాత్రి,పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. -
రెడ్ కార్పెట్ పరుస్తున్నారు..!
ఘట్కేసర్: గత రెండు మూడేళ్లుగా జిల్లాలో నెలకొన్న అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిపెడుతున్నారు. వరి పంట వేసి ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నా.. కరెంటు, వర్షాలు అనుకూలించకపోవడంతో వీరు ప్రత్యామ్నాయ పంటలే మేలనే నిర్ణయానికి వచ్చారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు క్రిమికీట కాలను తట్టుకొని నిలిచే కార్పెట్ గడ్డి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని అవుశాపూర్, అంకుశాపూర్, అన్నోజిగూడెం, ఏదులాబాద్ గ్రామాల్లో 300 ఎకరాల్లో కార్పెట్ గడ్డిని సాగు చేస్తున్నారు. ఒక ఏదులాబాద్ గ్రామంలోనే సుమారు వంద ఎకరాల్లో కార్పెట్ సాగవుతోదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కార్పెట్ గడ్డిని భవనాల చుట్టూ, పచ్చిక మైదానాల్లో, ఇళ్లు, కార్యాలయాలు తదితర చోట్ల విరివిగా వాడుతున్నారు. ఈ గడ్డితో పచ్చదనంతోపాటు అందం కూడా చేకూరడంతో ఇటీవల కాలంలో కార్పెట్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఎకరా విస్తీర్ణంలో కార్పెట్ గడ్డిని సాగు చేయడానికి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. కార్పెట్ గడ్డిని ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పెంచి కట్ చేస్తారు. రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుతో బిల్లల మాదిరిగా చేస్తారు. ఒక్కో బిల్ల నాణ్యతను బట్టి రూ.9 నుంచి రూ. 12 వరకు పలుకుతుంది. ఎకరానికి సుమా రు 17,500 బిల్లలు వస్తే, వాటిని విక్రయించగా రూ. 1.50 లక్షల ఆదా యం వస్తుంది. ఖర్చులు పోనూ రైతుకు ఎకరాపై రూ. 60 వే ల నుంచి రూ. 70 వేల వరకు లాభాలు రావచ్చు. అయితే ఈ పంటలో కలుపుతీత కూడా ముఖ్యమైనదే. కలుపు తీయడానికి రైతుకు రోజుకు రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. మార్కెటింగ్‌లో ప్రావిణ్యత సా ధిస్తే కార్పెట్ సాగులో మంచి లాభాలు గడించవచ్చని రైతులు చెబుతున్నారు.