రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో వ్యభిచార గృహాంపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడి చేశారు. ఆరుగురు యువతులతోపాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విటుడిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరుగురు యువతలను నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఘట్కేసర్లోని ఓ గృహంలో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ గృహంపై పోలీసులు దాడి చేశారు.