
బీరులో బల్లి..!
ఘట్‌కేసర్: బంధువులతో కలసి చల్లగా బీరు తాగుదా మనుకున్న ఓ వ్యక్తికి వింత ఘటన ఎదురైంది. కొను గోలు చేసిన బీరు సీసాలో మృతి చెందిన బల్లి కనిపించ డంతో అవాక్కయ్యాడు . ఈ ఘటన మందు బాబుల్లో కలకలం రేపుతోంది.
ఎల్‌బీ నగర్‌కు చెందిన విక్రమ్‌రెడ్డి గురువారం ఘట్‌కేసర్‌లోని బంధువుల ఇంటికి వచ్చా డు. స్థానికంగా ఉన్న ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లోని టీఎస్‌బీసీఎల్ లిక్కర్ షాపులో ఐదు బీర్లను కొనుగోలు చేశాడు. తాపీగా తాగుదా మని బీర్లను ఒపెన్ చేస్తుండగా అందులోని ఒక సీసాలో మృతి చెందిన బల్లి కని పించింది. ఆందో ళనకు గురైన అతడు వాటిని పక్కన పడేశాడు. ఈ ఘటనపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.