
క్రికెట్ ఆడుతూ మృతి
సాక్షి, ఘట్‌కేసర్ : క్రికెట్ ఆడుతూ మైదానంలో కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ తెలిపిన మేరకు.. చెంగిచెర్ల, బోడుప్పల్ వెంకటసాయినగర్‌లో నివాసముండే హర్యానాకు చెందిన లలిత్‌కుమార్(27) యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి. అవుషాపూర్ ఏఎన్ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా బంతిని పట్టుకునే క్రమంలో కింద పడిపోయి తిరిగి లేవలేదు. ఇతర క్రీడాకారులు ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment