ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ వద్ద బైక్ పై వెళ్తున్న రాములు అలియాస్ అబ్రహం(45) అనే వ్యక్తి అదుపు తప్పి డీసీఎం కిందపడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఘట్‌కేసర్ రైల్వే గేట్ సమీపంలోజరిగింది. కొండాపూర్‌కు చెందిన అబ్రహం ప్లంబర్ వర్క్స్ చేస్తుంటాడు. అదే పనుల నిమిత్తం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
డీసీఎం కిందపడి వ్యక్తి మృతి
Published Sat, Jan 24 2015 4:20 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement