ఘట్‌కేసర్ (రంగారెడ్డి) : అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఆస్తి తగాదాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి తన పిల్లలకు విషం ఇచ్చి తను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుశాపూర్ గ్రామంలో సోమవారం వెలుగు చూసింది.
స్థానికంగా హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణా రెడ్డి(45).. సోదరులతో గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై పదేళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, తను కూడా తాగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న బీబీ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
Published Mon, Dec 21 2015 5:03 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement