
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఘట్‌కేసర్(హైదరాబాద్): పెళ్లికి నిరాకరించి మరొకరితో చనువుగా ఉంటున్న వివాహితను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు గురువారం తెలిపిన మేరకు..శ్రీకాకుళం చెందిన లిమ్మ సంతోష(28) భర్తతో గొడవపడి సొంతూరికి వెళ్లిపోయింది. తల్లితండ్రులు, సోదరుడు, ముగ్గురు పిల్లలతో కలిసి ఏదులాబాద్‌లో ఉంటోంది. అదే ప్రాంతంలో ఉంటున్న మహారాష్ట్రకు చెందిన వినోద్ పర్స్‌రాం(28)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. పెళ్లి చేసుకోవాలని వినోద్ కోరగా ఆమె నిరాకరించింది. ఇతరులతో సన్నిహితంగా ఉండటాన్ని వినోద్ భరించలేకపోయాడు. దీంతో డిసెంబర్‌న 3న తాడుతో ఉరి వేసి సంతోషను హత్యచేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు వినోద్‌ను శామీర్‌పేట్ మండలం తూముకుంటలో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment