బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీకే సాధ్యం | elections rally: thotakura jangaiah yadav | Sakshi
Sakshi News home page

బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీకే సాధ్యం

Published Sun, Apr 27 2014 2:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీకే సాధ్యం - Sakshi

బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీకే సాధ్యం

మేడ్చల్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్

ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి తోటకూర జంగయ్యయాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్‌టెర్మినల్ ఆవరణలో మాట్లాడుతూ టీడీపీ హయూంలోనే మండలం అభివృద్ధి చెందిందన్నారు. మండల ప్రజాపరిషత్, తహసీల్దార్ కార్యాలయాలు, సంసృ్కతి టౌన్‌షిప్ తదితర నిర్మాణాలు చేపట్టారన్నారు. స్థానికేతరుడిగా ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యే కేఎల్లార్‌కు లేదన్నారు.

బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిగా ఇతర అభ్యర్థులతో బేరీజు వేసుకొని ఓటేసి తనను గెలిపించాలన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని టీడీపీ ప్రకటించిందని, ఇతర పార్టీలకు దమ్ముంటే సీఎం అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ విసిరారు. మేడ్చల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు.

 పిలిస్తే పలికే.. మండలానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంరెడ్డి, స్థానిక పంచాయతీ సభ్యులు రాంపల్లి జగదీష్‌గౌడ్, మీసాల సుధాకర్, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్, రాజబోయిన యాదగిరియాదవ్, బీజేపీ నాయకులు ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కంభం లక్ష్మారెడ్డి, గుండ్ల బాల్‌రాజ్, పసులాది చంద్రశేఖర్, బిక్కునాథ్‌నాయక్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.   

 నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
 మండలంలోని యంనంపేట్‌లో శనివా రం సాయంత్రం టీడీపీ నాయకుడు పొలగోని శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో యుువకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా  జంగయ్య యాదవ్ మాట్లాడుతూ యంనంపేట్ ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామన్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం, బ్రిడ్జి నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు అందచేస్తామన్నారు. తోటకూర జంగయ్య యాదవ్‌ను గొంగడితో సన్మానించి, గొర్రెపిల్లను టీడీపీ నాయకుడు శ్రవణ్‌కుమార్ బహుకరించారు.

 పొలగోని శంకర్, ప్రభాకర్‌గౌడ్, పొలగోని నర్సింహ, వెంకటేష్, చంద్రశేఖర్‌గౌడ్, మెట్టు కుమార్, బాషగళ్ల సుదర్శన్, సురేష్, చంద్రయ్యతో  పలువురు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోని ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పత్తెపు రాములు, శ్రీహరి, శంకర్, పోశెట్టి పాల్గొన్నారు.

అలాగే మండలంలోని ఏదులాబాద్, అవుశాపూర్, అంకుశాపూర్, ఎన్‌ఎఫ్‌సీ నగర్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన రోడ్‌షోలలో జంగయ్య యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాలేరు రామోజీ, బిక్కునాథ్ నాయక్, టీడీపీ నాయకులు రఘుపతి, పన్నాల ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్, డీవీ.రావు, రమాదేవి, మహిపాల్, భిక్షపతి, మహేష్, రాజు, రామలింగం, నడిమింటి వెంకటేష్, సాయిలు, రమేష్, సత్తయ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement