మరో రెండు పంచాయతీలకు ఎన్నికలు | The other two panchayats elections | Sakshi
Sakshi News home page

మరో రెండు పంచాయతీలకు ఎన్నికలు

Published Sun, Sep 22 2013 2:31 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

The other two panchayats elections

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తాజాగా మరో రెండు పంచాయతీల్లో ఎన్నికల నగారా మోగింది. ఘట్‌కేసర్, ఎన్‌ఎఫ్‌సీ నగర్ పంచాయతీలకు అక్టోబర్ 9న ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు పంచాయతీల పాలకవర్గ పదవీకాలం వచ్చే నెల 16వ తే దీన ముగియనుంది. ఈ నెల 25వ తేదీన మొదలయ్యే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 29న ముగియనుంది. 30న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 1న నామినేషన్లపై అభ్యంతరాల నమోదు, 2న అభ్యంతరాల పరిష్కారం, 3న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తామ ని కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. 9న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement