
కబళించిన అప్పు!
ఓ చిన్న కుటుంబాన్ని అప్పు కబళించింది. పనిచేస్తేనే ఇల్లు గడిచే ఆ కుటుంబం చేసిన రూ.50 వేల అప్పు.. ముగ్గురి బలవన్మరణానికి దారితీసింది. ఘట్‌కేసర్‌లోని కొండాపూర్ లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపై మంగళవారం ఉదయం భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతదేహం లభించడం కలకలం రేపింది. వీరు ఘట్‌కేసర్ సమీపంలోని మైసమ్మగుట్ట కాలనీకి చెందిన వారని గుర్తించారు. కాలనీకి చెందిన కొమ్మరి కుమార్(24), సుగుణ(21) దంపతులకు రెండేళ్ల కూతురు మహేశ్వరి ఉంది. పెళ్లి సమయంలో కుమార్ చేసిన అప్పు తీర్చే మార్గం కన్పించక మదన పడిన ఆ కుటుంబం చివరకు ప్రాణాలు తీసుకుంది.