
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేశారు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు చేశారు.
చదవండి: నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment