
ఘట్‌కేసర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, కొమురెడ్డి సురేందర్‌రెడ్డి ఆదివారం మరణించారు. ఆయన టీడీపీ నుంచి 1985లో ఎమ్మెల్యేగా, 1989లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో అటవీశాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారు.
బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2001లో టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్‌తో కలిసి పని చేశారు. గ్రామం, నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామం కొర్రెముల్‌లో సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.