క్షణికావేశంలో భార్యను బలిగొని.. పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్దే.. | Husband Commits Suicide At Wife Grave Who Killed His Wife Six Months Ago In Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో విషాదం: క్షణికావేశంలో భార్యను బలిగొని.. పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్దే..

Published Mon, Dec 9 2024 1:49 PM | Last Updated on Mon, Dec 9 2024 6:35 PM

Husband commits suicide at wife grave

ఆరు నెలల కిందట భార్యను హత్య చేసిన భర్త 

పశ్చాత్తాపంతో బలవన్మరణం   

చిత్తూరు జిల్లా: క్షణికావేశంలో చేసిన తప్పునకు పశ్చా­­త్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘ­టన ఇది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి(49), సుజాత భార్యాభర్తలు. ఇద్దరు కుమారులతో కలిసి పదేళ్ల కిందట బెంగళూరు వెళ్లి  కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఆరు నెలల కిందట ఘర్షణ పడ్డారు. గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణా­లు కోల్పోయింది. భార్య­ను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవి­తం గడిపి.. శనివారం బెయిల్‌పై విడుదలై స్వ­గ్రామంలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు. రాత్రి వారితో కలిసి భోజనం చేశాడు. 

ఇకపై తనను అందరూ భార్యను చంపేశానన్న ఏహ్య భావంతో చూస్తారని, క్షణికావేశంలో భార్యను చంపుకొన్నానని.. తనకు బతకాలని లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి ఇంట్లో కుమారులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున మెలకువ వచ్చిన కుమారులకు ఇంట్లో తండ్రి కనిపించలేదు. గ్రామంలో వెతికారు. గంగిరెడ్డి తన తండ్రి, భార్య సమాధుల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు. మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటమోహన్‌ కేసు దర్యాప్తు చేన్నారు.

చ‌ద‌వండి: ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement