సాక్షి, తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలోని ఓ వర్సిటీలో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థి మధ్య చిగురించిన ప్రేమ కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వారి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రి రూరల్ మండలం రాజవోలుకు చెందిన హెల్త్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ రెండో కుమారుడైన మందపాటి అజయ్‌కుమార్(20) వడ్డేశ్వరంలోని వర్సిటీలో బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు టీచర్ కుమార్తె బీబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తడంతో ఇద్దరూ కలిసి కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం చేస్తున్నారు. విద్యార్థిని కాలేజీకి తరచూ రావడం లేదనే విషయమై గత నెల 25న ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని గత నెల 29న రాజవోలులోని తల్లి దగ్గరకు వెళ్లిపోయింది.
బుధవారం సాయంత్రం అజయ్‌కుమార్ విద్యార్థినికి ఫోన్‌చేసి ఫ్లాట్‌లో పెంచుతున్న కుక్కపిల్ల (షాషా)కు ఫీడ్ ఇవ్వను, చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని హుటాహుటిన విజయవాడ వచ్చింది. రాత్రి 1.40 గంటల సమయంలో రోడ్డుమీద ఇద్దరూ గొడవ పడ్డారు. విద్యార్థిని నా జీవితాన్ని నాశనం చేయకు అని వేడుకోవడంతో అతను నన్ను ఎందుకు ప్రేమించావంటూ దురుసుగా ప్రవర్తించాడు.
చదవండి: ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్
ఆ తర్వాత ఇద్దరూ ఒకే బైక్‌పై ఫ్లాట్‌కు వెళ్లారు. రాత్రి 2.30 గంటలకు అలికిడి కావడంతో విద్యార్థిని నిద్ర లేచి చూడగా నోట్లో గుడ్డలు కుక్కుకుని కిటికీకి హీటర్ వైర్‌తో ఉరివేసుకుని అజయ్‌కుమార్ కనిపించాడు. భయపడిన విద్యారి్థని వెంటనే మిగతా ఫ్లాట్ల వారిని లేపి విషయం వివరించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment