రెండేళ్లుగా మహిళతో సహజీవనం...ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిని బలవంతంగా... | Man Molested On Live-in Partner Minor Daughter Chandigarh | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా మహిళతో సహజీవనం...ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిని బలవంతంగా...

Published Wed, Jan 12 2022 6:35 PM | Last Updated on Wed, Jan 12 2022 8:02 PM

Man Molested On Live-in Partner Minor Daughter Chandigarh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు నేరాలకు దారి తీస్తున్నాయి. అందులోని కొన్ని ఘటనలైతే కూతురు వరసయ్యే వాళ్ల మీద కూడా లైంగైక దాడులు పాల్పడుతున్నారు కొందరు కామందులు. తాజాగా ఇటువంటి ఘటనే చండీగఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన భర్తని ఆరేళ్ల క్రితం విడిచిపెట్టి ఒంటరిగా తన కూతురితో జీవనం గడుపుతోంది. రెండేళ్ల క్రితం ఆమెకు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

కొన్ని రోజులకు అది కాస్త వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దీంతో ఆ మహిళ డ్రైవర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అతను డ్రైవర్ ఉద్యోగం కోల్పోవడంతో  ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆ మహిళపై కూతురిపై కన్నేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ దారుణాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో మహిళ అతన్ని నిలదీయగా ఆమెతో ఘర్షణకు దిగి పారి పోయాడు. మహిళా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement