దిల్ రాజు ఫోన్ నెంబరే తెలియదు: షీలా | actress sheela denies rumours on live in relationship with producer dil raju | Sakshi
Sakshi News home page

దిల్ రాజు ఫోన్ నెంబరే తెలియదు: షీలా

Published Fri, Oct 24 2014 10:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

దిల్ రాజు ఫోన్ నెంబరే తెలియదు: షీలా - Sakshi

దిల్ రాజు ఫోన్ నెంబరే తెలియదు: షీలా

'పరుగు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్  షీలా తనపై వచ్చిన రూమర్లను తీవ్రంగా ఖండించింది.  ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు షీలాకు మధ్య లివ్ ఇన్ రిలేషన్ ఉన్నట్లు టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే.  ఈ రూమర్లపై  స్పందించిన షీలా....తనకు దిల్ రాజు ఫోన్ నెంబరే తెలియదని, అలాంటప్పుడు ఆయనతో ఎలా లింక్లు కడతారని ప్రశ్నించింది. తెలుగులో తాను నటించిన సినిమా విడుదలై సుమారు మూడేళ్లు అవుతుందని, అప్పటి నుంచి మంచి స్ర్కిప్ట్ దొరకనందున నటించటం లేదని తెలిపింది. చిత్ర పరిశ్రమతో తాను ప్రస్తుతం టచ్లో కూడా లేనని షీలా ఓ ఆంగ్ల దినపత్రికతో తెలిపింది.

గత ఏడాదిగా యూకేలో ఉంటున్నానని,  హైదరాబాద్ అడుగుపెట్టక మూడేళ్లు అయినట్లు ఆమె చెప్పింది. అలాంటప్పుడు ఇటువంటి వార్తలు ఎలా పుడతాయో అర్ధం కావటం లేదని షీలా వాపోయింది. తనకు హైదరాబాద్లో ఎవరూ స్నేహితులు లేరని స్పష్టం చేసింది. గతంలో హైదరాబాద్లో షూటింగ్ ఉంటే... అది పూర్తయిన వెంటనే చెన్నై వెళ్లిపోయేదాన్ని అని తెలిపింది. తనది కలివిడిగా ఉండే మనస్తత్వం కానందున బయట ఫంక్షన్లకు కూడా వెళ్లేదాన్ని కాదని, అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారితో మాట్లాడిన దాఖలాలు కూడా లేవని స్పష్టం చేసింది.

నిర్మాత దిల్ రాజుతో టచ్లో లేనని చెప్పిన షీలా...."ఒకసారి మాత్రమే దిల్ రాజుతో మాట్లాడాను. అది కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమా ఆడియో కార్యక్రమంలో. ఆయన ఫోన్ నెంబర్ కూడా తెలియదు. దిల్ రాజును చూసి కూడా చాలా కాలమైంది. మరి ఎందుకు ఇలాంటి రూమర్లు వస్తాయో  అనవసరంగా ఈ వివాదంలోకి లాగారు'' అని పేర్కొంది.

పరుగు సినిమా గురించి షీలా మాట్లాడుతూ ఆ సినిమాకు దిల్ రాజు నిర్మాత అయినా....తనను సెలెక్ట్ చేసింది  అల్లు అరవింద్ అని, ఫోటో షూట్ అనంతరం తాను ఎంపిక అయినట్లు చెప్పింది. ఇక చిత్ర పరిశ్రమకు దూరంగా వున్న విషయంపై ఆమె మాట్లాడుతూ మంచి స్క్రిప్ట్ తో ఎవరైనా తనను సంప్రదిస్తే...అప్పుడు ఆలోచిస్తానంది.

 

అది కూడా ఆ సినిమా ఎన్ని నెలల్లో పూర్తవుతుందనే దానిపైనే నిర్ణయం తీసుకుంటానని షీలా తెలిపింది.  ప్రస్తుతం రెండు స్క్రిప్ట్ లు పై చర్చలు జరుగుతున్నాయని చెప్పింది. మరోవైపు ఈ పుకార్లుపై దిల్ రాజు స్పందిస్తూ ....హీరోయిన్ షీలాతో మాట్లాడి చాలా కాలమైందని, నిరాధారమైన వార్తలపై తానెలా కామెంట్ చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement