
ఘజియాబాద్ : ఆస్తి వివాదంలో 38 ఏళ్ల మహిళను అత్యంత కిరాతకంగా చంపి ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లో పడేసిన ఉదంతం దేశ రాజధానిలో వెలుగుచూసింది. ఎనిమిది నెలల కిందట దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని లోని ప్రాంతంలో కుళ్లిపోయిన మహిళ శవాన్ని వెలికితీసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జౌరీపూర్‌కు చెందిన బేబీ ఆగస్ట్ 29 నుంచి అదృశ్యమైంది.
ఈ కేసుకు సంబంధించి తాజాగా బయటపడ్డ ఆధారాల ప్రకారం బేబీ సోదరి రేఖతో సహజీవనం చేస్తున్న జాన్ మహ్మద్‌ను పోలీసులు ప్రశ్నించగా దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. బేబీ సోదరి రేఖ తన ప్రియుడు, మరో నలుగురు ఇతరులతో కలిసి బేబీని హతమార్చినట్టు స్వయంగా జాన్ మహ్మద్ అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. తమ పుట్టింటి ఆస్తికి సంబంధించి రేఖ, బేబీ మధ్య వివాదం నడిచింది.
రేఖతో పాటు వారి సోదరుడు ఆస్తిని అమ్మాలని ప్రయత్నించగా బాధితురాలు బేబీ వారిని వారించేది. దీంతో రక్తంపంచుకుని పుట్టిన సోదరి బేబీని ప్రియుడు, మరో నలుగురి సహకారంతో రేఖ అంతమొందించింది. తాజా ఆధారాలతో రేఖతో పాటు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి త్యాగి తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు పంపామని, కేసు విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment