
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పాతికేళ్ల వయసు కలిగిన ఓ మహిళా డాక్టర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఢిల్లీలోని రంజిత్ నగర్‌లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ చదివి మాస్టర్స్ కోసం ప్రిపేరవుతున్న గరీమా మిశ్రా అనే వైద్యురాలు విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె గొంతు కోసి హతమార్చినట్టు ఆనవాళ్లు లభించాయి.
కాగా హత్య జరిగిన అనంతరం ఆమె పొరుగున ఉండే ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో హత్యతో వారికి సంబంధం ఉందనే అనుమానాలు బలపడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరితో ఆమె సన్నిహితంగా ఉండేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్నేహితుడు సైతం ఎండీ కోర్సుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment