చండీగఢ్: ఇద్దరు వయోజనులు కొన్ని రోజులు కలిసి జీవించి, తాము సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకోవడం నిజమైన సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్) కిందకు రాదని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. కలిసి జీవించే కాలం, ఈ కాలంలో ఇరువురు నెరవేర్చిన బాధ్యతలు, ఒకరికొకరు చేసుకున్న సాయం తదితర అనేక అంశాలను బట్టి సహజీవనాన్ని గుర్తించాల్సిఉంటుందని జస్టిస్ మనోజ్ బజాజ్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా స్త్రీ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఒక జంట పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది. దీంతో పాటు సదరు జంటకు రూ. 25వేల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment