Majors
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు!
చండీగఢ్: ఇద్దరు వయోజనులు కొన్ని రోజులు కలిసి జీవించి, తాము సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకోవడం నిజమైన సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్) కిందకు రాదని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. కలిసి జీవించే కాలం, ఈ కాలంలో ఇరువురు నెరవేర్చిన బాధ్యతలు, ఒకరికొకరు చేసుకున్న సాయం తదితర అనేక అంశాలను బట్టి సహజీవనాన్ని గుర్తించాల్సిఉంటుందని జస్టిస్ మనోజ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్త్రీ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఒక జంట పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది. దీంతో పాటు సదరు జంటకు రూ. 25వేల జరిమానా విధించింది. చదవండి: ఎమ్మెల్యే ‘అత్యాచార’ కామెంట్లు.. తీవ్ర దుమారం -
చేపల చెరువులకు.. సాగర్ జలాలు
కురిచేడు: ప్రజల దాహార్తి తీర్చేందుకు నాగార్జున సాగర్ కాలువకు విడుదల చేసిన నీటిని మేజర్లు, ఎస్కేప్ చానళ్ల ద్వారా చేపల చెరువులకు మళ్లిస్తున్నారు. జిల్లాకు విడుదల చేసిన జలాలు మంగళవారం రాత్రి కురిచేడు చేరాయి. ఈ నీటితో మంచినీటి చెరువులు, రిజర్వాయర్లను నింపాల్సి ఉంది. అయితే ఆ నీటితో చేపల చెరువులు నింపేందుకు పక్కా ప్రణాళిక తయారు చేశారు. అందుకు ఎన్ఎస్పీ అధికారుల సహకారం కూడా ఉందనే విమర్శలున్నాయి. చేపల చెరువులున్న మేజర్లకు నీటిని విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది. తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసిన నీటిని మేజర్ కాలువలకు విడుదల చేయకూడదు. కానీ ప్రధాన కాలువ పరిధిలోని 115వ మైలులో ఉన్న పడమర కాశీపురం మేజరుకు నీటిని విడుదల చేశారు. 116, 117, 118 మైళ్లలో ఉన్న కల్లూరు మేజర్లకు స్వల్పంగా నీటిని విడుదల చేసి సీపేజి అని చెబుతున్నారు. ఆ నీరు కల్లూరు చేపల చెరువుకు చేరుతోంది. 119 వ మైలులోని నాంచారపురం మేజరును ఎత్తివేసి ఆవులమంద చేపల చెరువుకు నీటిని తరలిస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని చేపల చెరువులు నింపేందుకు 124 వ మైలులోని ఐనవోలు మేజరును పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. దర్శి బ్రాంచి కాలువ పరిధిలోని పడమరవీరాయపాలెం మేజరుకు స్వల్పంగా నీటిని విడుదల చేశారు. పమిడిపాడు బ్రాంచి కాలువ పక్కనున్న ఎస్కేప్ చానల్ గుండా నీరు చేపల చెరువులకు చేరుతోంది. ఈ ఎస్కేప్‌ఛానల్ గోడను చేపల చెరువులకు నీరు వెళ్లేందుకు పడగొట్టారు. దీనిపై ఈనెల 11న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్ఈ కోటేశ్వరరావు అదేరోజు కాలువపై పర్యటించి పడిపోయిన గోడ నిర్మించాలని ఆదేశించారు. అయితే కిందిస్థాయి అధికారులు ఆ గోడ నిర్మిస్తూ రంధ్రాలు వదిలేయడంతో నీరు యథాప్రకారం బయటకు వచ్చి వాగుద్వారా చేపల చెరువుకు తరలిపోతోంది. స్థానిక అట్లపల్లి రిజర్వాయర్ ఉన్నచోట సాగర్ కాలువకు తూము ఏర్పాటు చేస్తే..కాలువకు నీరు వచ్చిన సమయం లో ఎటువంటి వ్యయం లేకుండానే రిజ ర్వాయరు నింపుకోవచ్చు. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో తాగునీటి కోసం నీరు విడుదల చేసినప్పుడల్లా వేలకు వేలు వెచ్చించి నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.