అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తానని చెప్పి ఓ వివాహితను తీసుకెళ్లిన ఓ యువకుడు, ఆమెను దారుణంగా హతమార్చాడు. సిద్ధ అనే యువకుడు ఈ ఘెరానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే ఇంతవరకు ఆ మహిళ మృతదేహం మాత్రం పోలీసులకు లభ్యం కాలేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, అతనొక్కడేనా అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.