బిగ్‌బాస్‌ నటితో సహజీవనం.. ఇప్పుడేమో సింగిల్‌గా ఉంటూ! | After breakup with Bigg Boss Contestant Pavitra Punia Eijaz Khan is single | Sakshi
Sakshi News home page

Eijaz Khan: బుల్లితెర నటితో బ్రేకప్.. ఇకపై అన్ని వదిలేసి!

Published Mon, Apr 8 2024 6:38 PM | Last Updated on Mon, Apr 8 2024 7:13 PM

After breakup with Bigg Boss Contestant Pavitra Punia Eijaz Khan is single  - Sakshi

బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ పవిత్రా పూనియా. ఈ ముద్దుగుమ్మ 2020లో బిగ్‌బాస్‌ -14వ సీజన్‌లో మెరిసింది. అదే సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇజాజ్ ఖాన్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డేటింగ్‌లో ఉన్న భామ.. ఏడాదిలోపే పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ.. అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. ఈ ఏడాదిలోనైనా పెళ్లిబంధంలోకి అడుగుపెడతారన్న జంట ఫిబ్రవరి 14న షాకింగ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నట్లు బుల్లితెర జంట ప్రకటించారు. 

బుల్లితెర నటులైన ఇజాజ్‌ ఖాన్‌- పవిత్ర పూనియా మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అంతకుముందు ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండగా.. గత నెలలో ఇజాజ్‌ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర పూనియా మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలికారు.

అయితే ప్రస్తుతం ఇజాజ్ ఖాన్ తన దృష్టినంతా కెరీర్‌పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ‍ప్రస్తుతం అతను ఎవరితోనూ రిలేషన్‌లో లేడని సమాచారం. దీంతో ఇజాజ్ సింగిల్‌గానే ఉంటున్నారు. గతంలో పునియాను ఇజాజ్ ఖాన్ మోసం చేశాడని.. విడిపోవడానికి అదే కారణమని రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ పూనియా తోసిపుచ్చింది. కాగా.. ఇజాజ్ ఖాన్ ప్రస్తుతం  కొత్త ఇంటికి మారాడు. అంతే కాకుండా దివ్యాంక త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. బ్రేకప్‌ అయ్యాక పూర్తిగా తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. కాగా.. పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్‌ కీ దస్తాన్‌-నాగమణి' అనే సీరియల్‌లో నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement