
దుబాయ్ : కఠిన చట్టాలకు పెట్టింది పేరైన ఇస్లామిక్ దేశాలతో కూడిన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. టూరిస్టులను ఆకర్షించేందుకు పలు చట్టాలను సరళతరం చేస్తోంది. మద్యపానం సేవించడం, సహజీవనం చట్టవిరుద్ధం కాదని ప్రకటించింది. అవివాహిత జంటలు ఒకేచోట నివసించేందుకు అనుమతించడంతో పాటు మద్యపానంపై నియంత్రణలను సరళతరం చేసస్తూ ఇస్లామిక్ వివాహ చట్టాల్లో కీలక మార్పులను యూఏఈ ప్రకటించింది.
పెట్టుబడుల వాతావరణం, చట్టాల అమలును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ సంస్కరణలను చేపట్టామని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. గతంలో మద్యం సేవించినా, మద్యాన్ని కలిగిఉన్నా యూఏఈలో నేరంగా పరిగణించేవారు. ఇక తాజా నిర్ణయంతో 21 సంవత్సరాలు పైబడిన వారు స్వేచ్ఛగా మద్యాన్ని సేవించవచ్చు. ఇక అవివాహిత జంట కలిసిఉండటం యూఏఈలో ఇప్పటివరకూ నేరం కాగా, ఆ చట్టాన్ని ప్రస్తుతం తొలగించారు. కాగా, యూఏఈ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. నూతన చట్టాలు పురోగమనానికి దారితీస్తాయని, ఈ ఏడాది పలు సవాళ్లు ఎదురైనా కీలక మార్పులకు నాందిపలికిందని అల్‌జజీరా ఛానెల్ వ్యాఖ్యానించారు. చదవండి : యూఏఈ ప్రధానికి ట్రయల్ కరోనా వ్యాక్సిన్
Comments
Please login to add a commentAdd a comment