సాక్షి, చిత్తూరు: భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ మరో వ్యక్తితో విహహేతర సంబంధం కొనసాగించడమే చివరికి ఆమె ప్రాణాలనే తీసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రధం మండంలోని తొప్పత్తిపల్లి పంచాయతీ మర్రిగుంటకు చెందిన పురుషోత్తం అనే వ్యక్తితో గుంటూరుకు చెందిన వనితకు వివాహం జరిగింది. వారికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం కుటుంబ కలహాలతో పురుషోత్తం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వనిత పుట్టింటికి వెళ్లిపోయింది. వనితకు అదే గ్రామానికి చెందిన భరత్ కుమార్ (23)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది.
కొన్ని రోజుల తర్వాత వారి మధ్య కలహాలు మొదలైయ్యాయి. గోడవలు ఎక్కువ కావడంతో భరత్.. వనితను, ఆమె కుమారుడిని అత్యంత దారుణంగా హత్యచేశాడు. శనివారం రాత్రి వనిత మవయ్య ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తల్లీకొడుకులు రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే ఇరుగు పొరుగు వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగలకొట్టి చూడగా భరత్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. తల్లీ, కొడుకుని హత్యచేసిన నిందితుడు భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment