
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటు చేసుకుంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్న యువతిని ఆమె సహచరుడు గదిలో బంధించి.. ఆపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు.. బాధిత యువతి, నిందితుడు గత కొన్నేళ్లుగా ఎర్నాకులం సిటీలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ ప్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు గత కొద్ది కాలంగా యువతిని చిత్రహింసలకు గురి చేయసాగాడు. బాధితురాలిని అవమానిస్తూ.. ఆమెపై అత్యాచారం చేస్తూ హింసించేవాడు.
ఈ టార్చర్ గురించి ఎవరికైనా చెబితే బాధితురాలి పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నిందితుడి ఆగడాలు మరింత మితిమీరాయి. ఏకంగా బాధితురాలిని గదిలో పెట్టి తాళం వేసి.. ఆమెపై దాడి చేయడమే కాక.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని.. వేరే ప్రదేశంలో షెల్టర్ పొందుతున్నాని పోలీసులకు తెలిపింది. ఇక నిందితుడు తన దగ్గర నుంచి ఇప్పటికే 5 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. బాధితురాలి శరీరమంతా గాయాలున్నాయన్నారు పోలీసులు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు అప్పటికే పారిపోయాడు.. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment