తిరువనంతపురం: తమ బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ఇటీవల చాలామంది చెబుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా చేరారు. తన బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పుకొచ్చిన ఆమె.. తనను వేధించిన వ్యక్తుల ముఖాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని తెలిపారు.
నేను లైంగిక వేధింపులకు గురయ్యా..
కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో పథనంథిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "ఇద్దరు మగవాళ్ళు నాపై ఆప్యాయత చూపేవారు. మొదట్లో, వారు నన్ను ఎందుకు ముట్టుకుంటున్నారో, అప్యాయంగా ఎందుకు పలకరించేవాళ్లో నాకు అర్థం కాలేదు. వారిద్దరూ నాతో అసభ్యకరంగా ప్రవర్తించావాళ్లు, ఆ సమయంలో నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది. ఎలాగోలా వారి నుంచి తప్పించుకోగలిగాను," అని చెప్పుకొచ్చింది.
చివరికి తన తల్లిదండ్రుల సహకారంతో తాను ఆ బాధ నుంచి తప్పించుకోగలిగానని వివరించారు. ప్రస్తుత సమాజంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని ఆమె సూచించారు. అయితే ఆ ఘటన తర్వాత తనను వేధించిన ఇద్దరూ ఎక్కడైనా కనిపిస్తారేమోనని చూశానని కానీ, ఆ తర్వాత వారు తనకు కనిపించలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment