Child Hood
-
కాస్మటిక్స్తో అర్లీ ప్యూబర్టీ ..! బాల్యపు ఛాయ వీడక ముందే ఎందుకిలా..?
పిల్లలు బాల్యాన్ని ఆస్వాదించాలి. బాల్యపు ఛాయలు వీడకముందే పెద్దయితే ఎలా? ఈ అవాంచిత మార్పుకు కారణాలు అనేకం. అర్లీ ప్యూబర్టీలో సౌందర్య సాధనాల పాత్ర చాలా పెద్దదని చెబుతోంది యూఎస్‌లోని అధ్యయన సంస్థ. చిన్నప్పుడే పెద్దవుతున్నారు! బాలికల్లో అర్లీ ప్యూబర్టీకి దారి తీస్తున్న కారణాల మీద యూఎస్‌లో ఒక అధ్యయనం జరిగింది. 1990ల కాలంతో పోలిస్తే ఇటీవల బాలికలు చాలా త్వరగా యుక్తవయసులోకి వస్తున్నారు. పునరుత్పత్తి వ్యవస్థ పరిణతి చెంది రుతుక్రమం మొదలవుతోంది. యూఎస్‌లో ప్రతి పదిమంది బాలికల్లో ఎనిమిది మంది చాలా చిన్న వయసు నుంచే మేకప్ వేసుకుంటున్నట్లు వెల్లడైంది.అర్లీ ప్యూబర్టీకి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం కూడా ఒక కారణమే అయినప్పటికీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించడానికి కారణం సౌందర్య సాధనాలుగా గుర్తించారు. రోజువారీ డిటర్జెంట్లు, పెర్ఫ్యూమ్ల తోపాటు మేకప్ సాధనాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటోందని అంచనా. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇదే అంశం మీద నిర్వహించిన జీబ్రాఫిష్ పరిశోధన కూడా ఈ రసాయనాల ప్రభావాన్ని నిర్ధారించింది. అర్లీ ప్యూబర్టీ కారణంగా పదేళ్లలోపే రుతుక్రమం మొదలవడం ఒక సమస్య అయితే దీర్ఘకాలంలో స్థూలకాయం, గుండె సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ తోపాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని ఎండోక్రైనాలజీ జర్నల్ ప్రచురించింది. కేన్సర్ కూడా ముందుకొచ్చింది! అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా పెరుగుతున్న క్యాన్సర్ల విషయానికి వస్తే... గతంలో క్యాన్సర్ బారిన పడడానికి సగటు వయసు 70 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు 35 ఏళ్ల లోపే క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ పరిశోధనల్లోనూ సౌందర్యసాధనాల పాత్రను ప్రధానంగా గుర్తిస్తున్నారు నిపుణులు. అల్ట్రా ప్రాసెస్డ్ కాస్మటిక్స్ స్కిన్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. ముఖం, జుట్టు, చర్మం అందంగా కనిపించడానికి వాడే సౌందర్యసాధనాల్లో ఉపయోగించే రసాయనాల కారణంగా ఎగ్జిమా, వెయిట్ గెయిన్ సమస్యలు కూడా వస్తున్నాయని అర్థమైంది. కొన్ని సందర్భాలో అర్లీ ప్యూబర్టీకి దారి తీసే పరిస్థితులు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలవుతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయితే ఆ ప్రభావం పుట్టే బిడ్డ మీద ఉంటుందని కొన్ని అధ్యయనాలు తెలియచేశాయి. నెయిల్ పాలిష్లలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని విషపూరిత రసాయనాలు కేన్సర్‌కు కారణమవుతున్నాయి. డిబ్యూటిల్ఫ్తాలేట్ పునరుత్పత్తి వ్యవస్థ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. మూత తీయగానే ఘాటు వాసన వచ్చే నెయిల్ పాలిష్‌లు, గ్లిట్టర్ పాలిష్‌లు మరింత హానికరమని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.మన దేశంలో బాలికల్లో కాస్మటిక్స్ వాడకం అమెరికాతో పోలిస్తే అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ స్థూలకాయం, దేహ కదలికలు తగినంతగా లేని జీవనశైలి, చదువు ఒత్తిడి బాలికల్లో అర్లీ ప్యూబర్టీకి కారణమవుతున్నాయి. కాబట్టి తోటి పిల్లలతో కలిగి దేహానికి శ్రమ కలిగించే ఆటలను ప్రోత్సహించాలని, పిల్లలను పిక్నిక్లకు తీసుకువెళ్లడం ద్వారా వాళ్ల దృష్టిని అనేక ఇతర సామాజికాంశాల మీదకు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. నాట్య ప్రదర్శనలు, ఇతర స్టేజ్ షోలలో పాల్గొనే పిల్లలకు మేకప్ తప్పని సరి అవుతుంది. అలాంటప్పుడు నిపుణుల సూచన మేరకు హానికరం కాని సౌందర్య సాధనాలను మాత్రమే ఉపయోగించాలి. మన దైనందిన జీవితంలో డిటర్జెంట్ల వాడకం తప్పదు, పైగా వాటి ప్రమాణాలను సంస్థాగతంగా తప్ప వ్యక్తులుగా నిర్దేశించలేం. మరో ముఖ్యమైన విషయం... రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగే అలవాటుంటే ఇక ముఖం మీద ఏ సౌందర్యసాధనమూ అవసరం లేదని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి. మేకప్ అవసరం లేదు! అర్లీ ప్యూబర్టీ ఆందోళన కలిగించే విషయమే. రసాయనాల ప్రభావానికి సంబంధించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి దేహ ఆరోగ్యాన్ని కచ్చితంగా కాపాడుకుంటే సన్‌స్రీన్, మాయిశ్చరైజర్ తప్ప ఇతర సౌందర్యసాధనాల అవసరమే ఉండదు. బాల్యంలోనే వీటి మాయలో పడుతున్నారంటే ప్రకటనల ప్రభావం తోపాటు అవి అందుబాటులో ఉండడం కూడా కారణమే. కొన్ని ప్రత్యేకమైన, అరుదైన సందర్భాల్లో మేకప్ తప్పనిసరి కావచ్చు. అలా ఉపయోగించేటప్పుడు కూడా ఆ బాలికలను డాక్టర్‌కు చూపించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలి. బాలిక చర్మతత్వాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేని మేకప్ తదితర సౌందర్యసాధనాలను సూచించగలుగుతారు. – డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్ (చదవండి: డాటర్ ఆట చూసి అమ్మ అంపైరయింది) -
Mahesh Babu Rare Photos: టాలీవుడ్ ప్రిన్స్.. బాల్యంలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా? (ఫోటోలు)
-
Mahesh Babu Rare Photos: టాలీవుడ్ ప్రిన్స్.. బాల్యంలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా? (ఫోటోలు)
-
వాళ్లిద్దరూ నాతో అసభ్యంగా ప్రవర్తించారు: మహిళా కలెక్టర్
తిరువనంతపురం: తమ బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ఇటీవల చాలామంది చెబుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా చేరారు. తన బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పుకొచ్చిన ఆమె.. తనను వేధించిన వ్యక్తుల ముఖాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని తెలిపారు. నేను లైంగిక వేధింపులకు గురయ్యా.. కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో పథనంథిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "ఇద్దరు మగవాళ్ళు నాపై ఆప్యాయత చూపేవారు. మొదట్లో, వారు నన్ను ఎందుకు ముట్టుకుంటున్నారో, అప్యాయంగా ఎందుకు పలకరించేవాళ్లో నాకు అర్థం కాలేదు. వారిద్దరూ నాతో అసభ్యకరంగా ప్రవర్తించావాళ్లు, ఆ సమయంలో నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది. ఎలాగోలా వారి నుంచి తప్పించుకోగలిగాను," అని చెప్పుకొచ్చింది. చివరికి తన తల్లిదండ్రుల సహకారంతో తాను ఆ బాధ నుంచి తప్పించుకోగలిగానని వివరించారు. ప్రస్తుత సమాజంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని ఆమె సూచించారు. అయితే ఆ ఘటన తర్వాత తనను వేధించిన ఇద్దరూ ఎక్కడైనా కనిపిస్తారేమోనని చూశానని కానీ, ఆ తర్వాత వారు తనకు కనిపించలేదని చెప్పారు. -
చిన్నప్పటి బడికి రాష్ట్రపతి
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కందగిరిలోని తపోబన హైస్కూల్‌ను ఆమె శుక్రవారం సందర్శించారు. ‘‘నా చదువు సొంతూరు ఉపార్బెడాలో మొదలైంది. గడ్డితో కప్పిన గుడిసెలో చదువుకున్నా. చుట్టూ పేడ, చెత్తను ఊడ్చి మేమే శుభ్రం చేసేవాళ్లం.’’ అన్నారు. అనంతరం 8 నుంచి 11వ తరగతి వరకు తాను చదువుకున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. చదువుకునే రోజుల్లో తానున్న కుంతల కుమారీ ఆదివాసీ హాస్టల్‌ను సందర్శించారు. 13 మంది చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. -
బాల్యం బడికి దూరం
సాక్షి, బెంగళూరు: అన్నెం పున్నెం ఎరుగని బాల్యంపై కరోనా భూతం పంజా విసిరింది. పాఠశాలల్లో అక్షరాలు నేరుస్తూ, ఆడుకోవాల్సిన చిన్నారులు పొలాల్లో, కార్ఖానాల్లో, దుకాణాల్లో పనివాళ్లుగా మారిపోయారు. రోజంతా పనిచేస్తే వచ్చే కూలీ తమతో పాటు ఇంట్లో వారి ఆకలి తీరుస్తుందన్న ధ్యాసే తప్ప చదువుకోవాలన్న ఆశ వారికి దూరమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయినా.. విద్యార్థుల చేరికలు తక్కువగా ఉన్నాయి. కరోనా వల్ల గత రెండేళ్లుగా వేలాదిమంది బాలలు బడికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలలు చదువు మానేసి ఏదో ఒక పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కుటుంబ పెద్దను కరోనా వైరస్ కబళించగా అనేక కుటుంబాలు దీనావస్థలోకి జారుకున్నాయి. ఫలితంగా మళ్లీ బడి ముఖం చూసే అదృష్టానికి వేలాది బాలలు నోచుకోలేకపోతున్నారు. ఈ సమస్య ఉత్తర కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 వేల మందిలో 35 శాతం మంది పిల్లల డ్రాపవుట్లపై ఎన్ఎఫ్హెచ్ఎస్ (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) చేపట్టిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది విద్యార్థులు తమకు చదువుపై ఆసక్తి లేదని చెప్పారట. 20 వేల మంది బాలురను సంప్రదించగా అందులో 35.7 శాతం మంది ఇదే మాట అన్నారు. బాధాకరమైన కారణాలు 21 వేల మంది బాలికలను ఈ ప్రశ్న అడగ్గా 21.4 శాతం మంది చదువు వద్దని చెప్పారు. బాధాకరమైన కారణాలు చదువుకునేందుకు పాఠశాలల్లో ఫీజులు చెల్లించేంత డబ్బు లేదు చదువుకు బదులు ఏదైనా పని చేసుకుంటే ఇల్లు గడుస్తుంది పాఠశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేని పరిస్థితి బాలికలకు సరైన వసతులు లేకపోవడంతో చదువంటే అనాసక్తి ప్రభుత్వ బడుల్లో సరైన బోధన లేదు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించి చదవలేం (చదవండి: ‘నాకీ భార్య వద్దు’ .. మ్యాగీ వండిపెట్టిందని విడాకులిచ్చాడు) -
చిన్నారులూ క్షమించండి: ఆస్ట్రేలియా ప్రధాని
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విద్యాసంస్థలు, మతపరమైన విద్యాసంస్థల్లో దశాబ్దాలపాటు లైంగిక వేధింపులకు గురైన వేలాది మంది బాలబాలికలకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ క్షమాపణలు చెప్పారు. వీరిని రక్షించడంలో తాము వైఫల్యం చెందామని అంగీకరించారు. నమ్మకం, మతవిశ్వాసాల మాటున ఈ తప్పులను దాచుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చర్చ్‌లు, అనాథాశ్రమాలు వంటి విద్యాసంస్థల్లో బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఐదేళ్లపాటు కొనసాగిన విచారణ నివేదిక సమర్పించింది. అనంతరం దీనిపై ప్రధాని మాట్లాడుతూ..‘మిమ్మల్ని(చిన్నారులు) కాపాడటంలో మేం విఫలమయ్యాం.. క్షమించండి. మీ(తల్లిదండ్రుల) నమ్మకాన్ని ఒమ్ము చేశాం. ఈ లైంగిక వేధింపుల పరిణామాలను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని క్షమాపణలు కోరుతున్నా’ అంటూ ప్రధాని కన్నీరు పెట్టుకున్నారు. -
ఈ పదేళ్ల పాపపై ప్రపంచ దృష్టి
పుణె: పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారిపై తల్లిదండ్రుల ప్రభావమే అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏం కలలు కంటుంటారో, ఏది మంచి ఏది చెడు అని చెప్తుంటారో సహజంగా అదే వారి మనసులో నాటుకుపోయి ఆ ప్రభావం వారిపై చెరిపేయలేని స్థాయిలో ఉండిపోతుంది. అది ఎంతమేరకు ప్రభావం ఉంటుందో, అలాంటి ప్రభావం వారిపై ఏ విధమైన ఒత్తిడి కలగజేస్తుందో.. అసలు వారికి ఏం కావాలో అనే విషయాన్ని పుణెకు చెందిన ఇషితా కాత్యాల్ అనే బాలిక అనర్గలంగా చెప్పింది. సాధారణంగా పెద్దపెద్దవాళ్లే వేదికపైకి ఎక్కి మాట్లాడేందుకు తటపటాయించే ఈ రోజుల్లో ఈ గడుగ్గాయి అతిరథమహారథులు పంచుకున్న వేదికపైకి ఎక్కి వారికి గుక్క తిప్పుకోలేని ప్రశ్నలు వేసింది. పిల్లల తరుపున తనొక్కతే ఒకల్తా పుచ్చుకొని వారి భావాలను బయటపెట్టింది. పుణెలో చదువుతున్న ఇషితా కాత్యాల్ అనే పదేళ్ల బాలిక ఈ ఏడాది కెనడాలో నిర్వహించిన టెక్నాలజీ, ఎంటర్ టైన్మెంట్, డిజైన్ (టీఈడీ) కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగాన్ని చేసింది. ఆమె అలా చేస్తున్నప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన టెక్నాలజీ మేథావులు, వ్యాపార వేత్తలు, గొప్పగొప్ప తత్వవేత్తలు ఉన్నారు. వీరంతా ఇషితా ప్రసంగం చేస్తున్న సమయంలో కిక్కురుమనకుండా కూర్చుండిపోయారు. ఆమె ప్రశ్నలు అడిగే తీరు సమాధానాలు చెబుతున్న తీరు మేథావులను కూడా ఆలోచనలో పడేసింది. 'పిల్లలు పెరిగే క్రమంలో అసలు వారు ఏంకావాలని కోరుకుంటారో మీకు తెలుసా.. మీరు కచ్చితంగా వారిని అలా అడగాలి కానీ ఎప్పుడైనా అడిగారా' అంటూ ఇషితా నిలదీసింది. 'మా కలలు తీసి పారేయకండి. మేం ఈ సమయంలో చాలా చేయగలం. మన ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే చాలా శక్తులు పిల్లల కలలకు వ్యతిరేకంగానే పనిచేస్తూనే ఉన్నాయి. మాకంటూ ఓ ప్రత్యేక భవిష్యత్ ఉంది. నా కల ఏమిటంటే.. పాఠశాల స్కూల్ ఫీజులు పెంచేముందు పదిసార్లు ఆలోచించాలి. మరో దేశంపైకి యుద్ధానికి పోయేముందు వందసార్లు ఆలోచించాలి. నీరు, ఆహారం వృధా చేసేముందు వెయ్యిసార్లు ఆలోచించాలి. అలాగే, తమ చిన్నారులు, వారి బాల్య జీవితం సాగుతున్న క్రమంలో వారి తల్లిదండ్రులు పదివేలసార్లు ఆలోచించాలి. ఇలా చేస్తే బాగుంటుందనేది నా కల' అని చెప్పింది. -
బాబుకు ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్... ఏం చేయాలి?
మా బాబుకు ఏడేళ్లు. అతడికి రెండున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. దాంతో స్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాం. చాలారోజులు అబ్జర్వేషన్లో ఉంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇంటస్ట్టీషియల్ లంగ్ డిసీజ్ అని చెప్పారు. అప్పట్నుంచి వాడికి సమస్య వచ్చినప్పుడు తీవ్రంగా ఆయాసపడుతూ డొక్కలెగరేస్తూన్నాడు. ఇలా సమస్య వచ్చినప్పుడల్లా అక్కడికే తీసుకెళ్తున్నాం. వారు అక్కడ స్టెరాయిడ్స్‌తో చికిత్స చేసి, మెరుగుపడ్డ తర్వాత డిశ్చార్జి చేస్తున్నారు. ప్రతి నెలా తీసుకెళ్లి చూపిస్తున్నాం. గతేడాది పరిస్థితి బాగానే ఉండటంతో ఈ నెలలో ఫాలో అప్‌కు తీసుకెళ్లడంలో కాస్త ఆలస్యం అయ్యింది. దాంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వెంటవెంటనే జబ్బు తిరగబెట్టింది. మా వాడి సమస్యకు పరిష్కారం ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి. - ఎ.పి. సురేశ్ కుమార్, చిత్తూరు మీరు వివరించిన దాన్ని బట్టి మీ అబ్బాయికి ఛైల్డ్‌హుడ్ ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఇది ఊపిరితిత్తులలోని రెండు వైపుల భాగాలతో పాటు దానిలోని అన్ని ముఖ్యమైన భాగాలనూ అంటే... అల్వియోలై, ఇంటస్ట్టీషియమ్ మొదలైన వాటన్నింటినీ ప్రభావితం చేస్తుంది. దీన్ని ఒక జబ్బుగా పేర్కొనడం కంటే దానికి సంభవించిన ఏదో ఒక నష్టం (ఇన్సల్ట్) వల్ల ఊపిరితిత్తులకు చెందిన స్వరూపంలోనే వచ్చే మార్పుగా చెప్పడం సరైనదిగా పేర్కొనవచ్చు. దాని ఫలితంగానే లక్షణాలు బయటకు కనిపిస్తాయి. చాలామంది పిల్లల్లో లక్షణాలు బయటపడినప్పుడు వాటిని బట్టి ఇది నిర్దిష్టంగా ఫలానా కారణంగా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అనంతర పరిణామం (పోస్ట్ ఇన్ఫెక్షియస్)గా ఇది కనిపించడంతో పాటు కొన్నిసార్లు బయటి నుంచి అవాంఛితమైన పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం (ఆస్పిరేషన్) వల్ల ఇది రావచ్చు. (అంటే ఏదైనా తింటున్నప్పుడు ఆహారపదార్థపు ముక్కల వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం లాంటివి). కారణాలు : అవాంఛితమైన పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం, ఇన్ఫెక్షన్స్, వాతావరణంలోని మార్పులు, మందులు, నియోప్లాస్మిక్ కండిషన్స్ (క్యాన్సర్ సంబంధిత అంశాలు), సర్ఫెక్టెంట్ అనే అంశంలో లోపాలు ఉండటం, కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ, లివర్, పేగు సంబంధిత వ్యాధులు మొదలైనవన్నీ ఇంటస్ట్టీషియల్ లంగ్ డిసీజ్‌కు కారణాలు. ఈ జబ్బు ఏ వయసులోనైనా రావచ్చు. లక్షణాలు : దగ్గు, ఊపిరి బలంగా, ఎక్కువసార్లు తీసుకోవడం... ఈ లక్షణాలు నెల కంటే ఎక్కువ రోజులు కనిపించడం, కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉన్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ), ఎదుగుదలలో లోపం, చిన్నారుల శరీరం నీలంగా మారడం (సైనోసిస్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్‌ను నిర్ధారణ (డయాగ్నోజ్) చేయడానికి లక్షణాలతో పాటు సవివరమైన వైద్య పరీక్షలు అవసరం. ప్రత్యేక స్కోరింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోగుల వ్యాధి తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. పైన పేర్కొన్న లక్షణాలున్న ప్రతివారికీ అది ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మరికొన్ని వ్యాధుల్లో... అంటే ఉదాహరణకు కొన్ని రకాల గుండెజబ్బులు, ఆస్తమా, టీబీ, కొన్ని వ్యాధినివారణ శక్తి లోపించిన సందర్భాలు (ఇమ్యునలాజికల్ లోపాలు), సీలియరీ డిస్కనేసియా వంటి జబ్బులు కూడా పైన పేర్కొన్న లక్షణాలతోనే కనిపించవచ్చు. అందుకే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ నిర్ధారణ చేయడానికి పూర్తిస్థాయి రొటీన్ పరీక్షలు, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు (అంటే హెచ్ఆర్సీటీ, పీఎఫ్‌టీ, శాచ్యురేషన్ ఎస్ఏఓ-టు), అలర్జీకి సంబంధించిన పరీక్షలతో పాటు లంగ్ బయాప్సీ, బ్రాంకోస్కోపీ పరీక్షలను తప్పనిసరిగా చేయాలి. అలాగే కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు తెలుసుకోవడానికి డీఎన్ఏ మ్యూటేషన్ పరీక్షల వంటి జెనెటిక్ పరీక్షలు చేయించాలి. వీటన్నింటి వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చిన మార్పులను బట్టి అది ఏ ఉపవర్గానికి (సబ్‌టైప్‌కు) చెందినదో తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఇది ఏ మేరకు నయమవుతుందో తెలుసుకోడానికి (ప్రోగ్నోసిస్‌కు) ఇది చాలా ముఖ్యం. ఇక మీ బాబు విషయంలో అది ఇన్ఫెక్షన్ అనంతర (పోస్ట్ ఇన్ఫెక్షియస్) పరిణామంగా వచ్చి ఉండవచ్చు. మీ అబ్బాయి విషయంలో ఒక మంచి పరిణామం ఏమిటంటే అతడికి ఆక్సిజన్ ఇవ్వడం వల్ల, కొద్దిపాటి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మెరుగుదల కనిపిస్తోందని మీరు చెప్పారు. అది మీ అబ్బాయి కండిషన్‌కు మెరుగుదల విషయంలో మంచి సూచన. ఇక ఈ జబ్బు ఎందుకు వస్తోందని నిర్ధారణ చేయడం అన్నది చాలా ప్రత్యేకమైన పెద్ద సెంటర్ల (స్పెషలైజ్డ్ లంగ్ సెంటర్స్) లో మాత్రమే సాధ్యపడుతుంది. ఇది తెలుసుకోవడం ఎందుకంటే... ఈ జబ్బు విషయంలో కారణాలను బట్టే చికిత్స ఆధారపడుతుంది. ఆక్సిజన్ ఇవ్వడం, పల్స్ మిథైల్ ప్రెడ్నిసలోన్ థెరపీ అన్నవి ఈ చికిత్సలో చాలా ప్రధానం. ఇక కారణం తెలియని పరిస్థితుల్లో ఇమ్యునోసప్రెస్సెంట్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో కొన్ని కేసుల్లో పేషెంట్స్ సుదీర్ఘకాలం పాటు కేవలం ఆక్సిజన్ మీద ఉండటం వల్ల కూడా మెరుగుదల కనిపించిన దాఖలాలు ఉన్నాయి. మందులతో ఎలాంటి ప్రయోజనం కనిపించని సందర్భాల్లోనూ, బయటి నుంచి ఇవ్వాల్సిన ఆక్సిజన్ ఎక్కువగా ఇవ్వాల్సివస్తున్న పరిస్థితుల్లో మాత్రం ‘ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స’ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మీరు పైన పేర్కొన్న విధానంలో వైద్య చికిత్స చేయిస్తూ అలర్జీకి కారణమయ్యే అంశాల (అలర్జెన్స్) నుంచి పిల్లవాడిని దూరంగా ఉంచుతూ, ఎవరైనా పొగతాగుతుంటే ఆ పొగ (పాసివ్ స్మోకింగ్) నుంచి కూడా దూరంగా ఉంచుతూ, పిల్లవాడిలో ఎలాంటి మార్పులు కనిపించినా తక్షణం వైద్యసహాయం కోసం తీసుకెళ్తూ, పల్మునరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ వంటి దుష్ర్పభావాలు కనిపిస్తే దానికి తగిన చికిత్స చేయిస్తూ ఉండటం ఈ పిల్లల విషయంలో చాలా అవసరం. పల్మునాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఇమ్యునాలజిస్ట్‌ల పర్యవేక్షణలో ఉంచడం కూడా చాలా అవసరం. దీనికి ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏదీ లేదు. అయితే పుష్టికరమైన ప్రోటీన్లు, క్యాలరీలతో కూడిన ఆహారం ఇవ్వడం మాత్రం అవసరం. ఇక అతడి దినచర్యల విషయానికి వస్తే అతడు సౌకర్యంగా ఉండేలా చూడటం ముఖ్యం. ఇక ఈ జబ్బు ఉన్న పెద్ద పిల్లలకు నిపుణుల పర్యవేక్షణలో కొన్ని వ్యాయామ విధానాలు (మానిటర్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్) ఇతరత్రా సాధారణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీళ్లలో క్రమం తప్పకుండా ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయులు పరిశీలిస్తూ ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మీరు నిత్యం ఒక పీడియాట్రిక్ లంగ్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే చికిత్స తీసుకుంటూ వారి ఫాలోఅప్‌లో ఉండటం చాలా ముఖ్యం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్