భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కందగిరిలోని తపోబన హైస్కూల్‌ను ఆమె శుక్రవారం సందర్శించారు. ‘‘నా చదువు సొంతూరు ఉపార్‌బెడాలో మొదలైంది. గడ్డితో కప్పిన గుడిసెలో చదువుకున్నా.
చుట్టూ పేడ, చెత్తను ఊడ్చి మేమే శుభ్రం చేసేవాళ్లం.’’ అన్నారు. అనంతరం 8 నుంచి 11వ తరగతి వరకు తాను చదువుకున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. చదువుకునే రోజుల్లో తానున్న కుంతల కుమారీ ఆదివాసీ హాస్టల్‌ను సందర్శించారు. 13 మంది చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment