సాక్షి, నెల్లూరు జిల్లా: గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్.. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి భరోసా కల్పించారు. చేసిన మేలును వివరించేందుకు మంగళవారం కోవూరు నియోజకవర్గంలోని నార్తురాజుపాళెంలో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారు.
సామాజిక సాధికార యాత్ర మధ్యాహ్నం టపాతోపు వద్ద నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి రాజుపాళెం సెంటర్‌కు చేరుకుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి పీ రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, నెల్లూరు నగర ఎమ్మెల్యే పీ అనిల్‌కుమార్‌యాదవ్, ప్రముఖ సినీనటుడు అలీ, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన: రాజన్న దొర
ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన జరుగుతుందని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి లంచాలు, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గిరిజనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. సామాజిక న్యాయం సీఎం జగన్ తోనే సాధ్యం. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.. వైసీపీ హయాంలో గిరిజనులకు సమ న్యాయం జరుగుతుంది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులకు 40 వేల ఎకరాలు ఇస్తే.. సీఎం జగన్ నాలుగన్నర ఏళ్లలో గిరిజనులకు ఇచ్చిన భూమి మూడు లక్షల ఎకరాలు.
దళిత, గిరిజన పిల్లలు ఇంగ్లిష్ విద్యను అభ్యసించడం చంద్రబాబుకి ఇష్టం లేదు. టీడీపీ హయాంలో గిరిజనులకు జరిగిన అన్యాయంపై విజయవాడ, విజయనగరంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. మాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేసిన విషయాన్నీ ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. దగుల్బాజీ, దగాకోరు, మోసగాళ్లు అందరూ టీడీపీ, జనసేనలోనే ఉన్నారు.
రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర నిలిచిపోతుంది: మంత్రి మేరుగ నాగార్జున
ఎస్టీ,ఎస్టీ,బీసీల సామాజిక స్థితిగతులు పెరగాలని సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్‌కి తెలిసిన సామాజిక సాధికారత. దళితులపై దాడులు, దౌర్జన్యాలు టీడీపీ హయాంలో ఎక్కువగా జరిగిన విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. చంద్రబాబుకి వయస్సు పైబడి.. మతిస్థిమితం కోల్పోయారు. భావితరాల భవిష్యత్తును ఇచ్చే ముఖ్యమంత్రి ఏపీకి దొరికారు. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. రాజ్యాంగబద్ధంగా దళితులకీ వచ్చిన హక్కులను చంద్రబాబు కాలరాశారు
టీడీపీ కళ్లకు కనిపించడం లేదా?: ఎమ్మెల్సీ పోతుల సునీత
లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఇస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదని యువగళం సభలో లోకేష్ మాట్లాడటం సిగ్గు చేటు. అభివృద్ధి జరగలేదని ఎల్లో మీడియతో ప్రచారం చేయిస్తున్నారు. పరిశ్రమల స్థాపన.. ఫిషింగ్ హార్భర్లు ఏర్పాటు.. టీడీపీకి కళ్లకి కనిపించడం లేదు. 2019లో వచ్చిన ఫలితాలే.. 2024లో కూడా రిపీట్ అవుతాయి. పవన్, చంద్రబాబు, లోకేష్‌లు టూరిస్ట్ రాజకీయాలు చేసే నాయకులు
సీఎం జగన్ ఆలోచన గొప్పది: అలీ
పేదల కష్టాలను సీఎం జగన్ దగ్గర నుంచి చూశారు. వారి కడుపు నింపేందుకు సంక్షేమ పథకాలకు రూప కల్పన చేశారు. తండ్రి వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. ప్రతి నిరుపేదకి సొంత ఇళ్లు ఉండాలనే సీఎం జగన్ చేసిన ఆలోచన గొప్పది.
అదే జరిగితే సంక్షేమ పథకాలు అందవు: మాజీ మంత్రి అనిల్
ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. వలంటీర్లను తీసేస్తామని టీడీపీ చెబుతుంది. అదే జరిగితే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందవు. జగన్ గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు.. గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి జగన్. పవన్, చంద్రబాబు కట్ట కట్టుకుని వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు.
Comments
Please login to add a commentAdd a comment