సత్వర న్యాయానికి చర్యలు
సత్వర న్యాయానికి చర్యలు
Published Sun, Mar 19 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
కొవ్వూరు రూరల్ : కేసుల్లో విచారణ పత్రాలను సరైన రీతిలో కోర్టుకు అందజేస్తే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వైబీఎస్‌జీ పార్థసారథి అన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్‌లో శనివారం నిర్వహించిన ప్రాసిక్యూట్ అధి కారులు, పీపీలు, ఏపీపీలు, పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేసులు ఎలా పరి ష్కరించాలి, ప్రజలకు న్యాయం అందించేందుకు అవసరమైన చర్యలు న్యాయపరంగా ఎలా చేపట్టాలి, న్యాయపరమైన అంశాలపై న్యాయమూర్తి సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీసులు కేసులు నమో దు చేసిన తరువాత కోర్టులకు అందజేయాల్సిన విచారణ పత్రాలు సరైన రీతిలో ఉంటే వెంటనే బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చింతా రాంబాబు, పీపీ జేకే కాంతారావు, ఏపీపీలు అల్లూరి సత్యసాయిబాబా, రాజన శ్రీ నివాస్‌తో పాటు కొవ్వూరు డివిజన్ పరి ధిలోని పీపీలు, ఏపీపీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Advertisement