PROSECUTE
-
చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు. స్కామ్ ఏమిటి? మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్‌కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం. ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది. కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్‌లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్‌లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట ఢిల్లీ హైకోర్టు బెయిల్‌పై జోక్యానికి నో... ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్‌ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్‌కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి. -
కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: బ్లాక్ మనీ చట్టం కింద పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ ఖాతాల్లో రూ. 814 కోట్ల మేర రహస్యంగా దాచిన నిధులపై రూ. 420 కోట్ల పన్నులను ఆయన ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని అభియోగాలు మోపింది. ఆయన కావాలనే విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించలేదని ఆరోపించింది. (భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి) దీనికి సంబంధించి ఆగస్టు తొలినాళ్లలో ఐటీ శాఖ అంబానీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2012-13 నుంచి 2019-20 అసెస్మెంట్ సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి విదేశాల్లోని అసెట్లను వెల్లడించక పోవడం ద్వారా అనిల్ అంబానీ పన్నులు ఎగవేశారని పేర్కొంది. ఆగస్టు 31లోగా అభియోగాలపై సమాధానమివ్వాలని సూచించింది. డైమండ్ ట్రస్ట్, నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్లిమిటెడ్ (ఎన్‌ఏటీయూ) అనే రెండు విదేశీ సంస్థల కూపీ లాగితే వాటి అంతిమ లబ్ధిదారు అనిల్ అంబానీయేనని తేలినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి : అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! -
సత్వర న్యాయానికి చర్యలు
కొవ్వూరు రూరల్ : కేసుల్లో విచారణ పత్రాలను సరైన రీతిలో కోర్టుకు అందజేస్తే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వైబీఎస్జీ పార్థసారథి అన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన ప్రాసిక్యూట్ అధి కారులు, పీపీలు, ఏపీపీలు, పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేసులు ఎలా పరి ష్కరించాలి, ప్రజలకు న్యాయం అందించేందుకు అవసరమైన చర్యలు న్యాయపరంగా ఎలా చేపట్టాలి, న్యాయపరమైన అంశాలపై న్యాయమూర్తి సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీసులు కేసులు నమో దు చేసిన తరువాత కోర్టులకు అందజేయాల్సిన విచారణ పత్రాలు సరైన రీతిలో ఉంటే వెంటనే బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతా రాంబాబు, పీపీ జేకే కాంతారావు, ఏపీపీలు అల్లూరి సత్యసాయిబాబా, రాజన శ్రీ నివాస్‌తో పాటు కొవ్వూరు డివిజన్ పరి ధిలోని పీపీలు, ఏపీపీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మర్డర్ కేసులో చిలుక సాక్ష్యం!!
మిచిగన్ః పసి పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చిలకపలుకులు అంటాం. అటువంటిది నిజంగా ఆ చిలకే పలికితే ఎంత అద్భుతంగా ఫీలవుతాం. దానికి వచ్చీ రాని మాటలను దాంతో మళ్ళీ మళ్ళీ చెప్పించి ఎంజాయ్ చేస్తాం. అయితే అమెరికాలోని ఓ గడసరి చిలుక.. తన పలుకులతో ఏకంగా ఓ మర్డరిస్టును గుర్తించేట్లు చేసిందట. ఓ మహిళ తన భర్తను హత్య చేసిన కేసులో.. చంపిన వ్యక్తిని గుర్తించిన చిలుక.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా మిచిగన్ సౌండ్ లేక్ ప్రాంతంలో గత మే నెల్లో జరిగిన ఓ హత్య కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. 48 ఏళ్ళ గ్లెన్నా దురాన్ ఆమె భర్త మారిటిన్ దురాన్ ను హత్యచేసినట్లుగా నమోదైన కేసులో ఆ పెంపుడు చిలుక ప్రధాన సాక్ష్యం చెప్పింది. మారిటిన్ దురాన్ ను అతడి భార్య గ్లెన్నా దురాన్ తుపాకీతో షూట్ చేసే ముందు వారిద్దరికీ జరిగిన వాగ్వాదాన్ని ఆ చిలుక ఎంతో స్పష్టంగా చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గ్లెన్నా తన ఇంట్లోనే ఉన్న భర్తపై సుమారు నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు మృతుడికి తగిలిన గాయాలను బట్టి తెలియగా... మారిటిన్ మరణించిన కొద్ది రోజుల తర్వాత బయటపడ్డ ఓ వీడియో లోని చిలుక పలుకులు ఇప్పుడు కేసులో ప్రధాన సాక్ష్యాలయ్యాయి. మారిటిన్ హ్యత్య జరిగిన రోజు గ్లెన్నాను అతడు వారిస్తున్నట్లు, అయినా పట్టించుకోకుండా షూట్ చేసినట్లు చిలుక మాటలను బట్టి అర్థమౌతోంది. అతడు మరణించినప్పటినుంచీ చిలుక నోట... పదే పదే వెలువడుతున్న మాటలను ఇప్పుడు హత్య కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలుగా ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఆఫ్రికన్ ప్యారెట్.. గెట్ అవుట్, వేర్ విల్ గో, డోంట్ షూట్ అంటూ మార్చి మార్చి పలకడం మారిటిన్ హత్య జరిగిన రోజు భార్యా భర్తలిద్దరి మధ్యా జరిగిన వాగ్వాదంగా విచారణలో గుర్తించే అవకాశం కనిపిస్తోంది. చిలుక పలికన పదాలను అధ్యయనం చేసి, అనంతరం వాటిని విలువైన సాక్ష్యంగా అనుమతిస్తామని నెవాగో ప్రాంత నేర విచారణ అటార్నీ రాబర్ట్ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. ఇదో ఆసక్తికరమైన, వింత విషయమని, ఇప్పుడు తమకు ఆఫ్రికన్ చిలుకల గురించి తెలుసుకునే గొప్ప అవకాశం కూడ వచ్చిందని ఆయనన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమయాల్లో చిలుక సాక్ష్యాన్ని వినియోగించడంపై కూడ పరిశీలిస్తున్నామని, చిలుకల సాక్ష్యాన్ని నమ్మడమా? వాటి మాటలను బట్టి ప్రత్యేక ఆధారాలను సేకరించడమా అన్న విషయాలను పరిశీలిస్తున్నామని రాబర్ట్.. ఓ పత్రికతో తెలిపారు. -
ఐఏఎస్ దంపతుల అవినీతిపై విచారణ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ దంపతుల్ని విచారించేందుకు కేంద్రప్రభుత్వం లోకాయుక్తకు అనుమతిచ్చింది. అరవింద్ జోషీ, టినూ జోషీ అనే ఐఏఎస్ దంపతులు ఆదాయానికి మించి 41 కోట్ల రూపాయిలు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. వీరిద్దరినీ విచారించేందుకు లనుమతివ్వాలని లోకాయుక్త కోరగా, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జోషీ దంపతులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిద్దరిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు లోకాయుక్త వర్గాలు తెలిపాయి. జోషీ దంపతులతో పాటు మరో 15 మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అరవింద్ తండ్రి హెఎం జోషీ, తల్లి నమ్రతా జోషీ, సహాయకులపై చార్జిషీట్ వేయనున్నారు. 1979 బ్యాచ్‌కు చెందిన జోషీ దంపతుల ఇంటిపై 2010లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు జరిపి అక్రమాస్తుల్ని గుర్తించారు.