కొవ్వూరు: వేములూరు ఉప సర్పంచ్ శీని సత్యవరప్రసాద్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. వివాద రహితుడిగా పేరున్న ప్రసాద్ హత్య వార్తతో వేములూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉదయం ఆయన తన స్వగృహంలోని వరండాలో విగతజీవుడిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. డీఎస్పీ వీఎస్‌ఎన్ వర్మ, పట్టణ సీఐ ఏఎల్‌ఎస్ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. భార్య శ్రీకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అసలు రాత్రి ఏం జరిగిందో...
శనివారం రాత్రి పదిన్నర గంటల వరకు ప్రసాద్ ఇంటి దగ్గర స్థానికులతో మాట్లాడారని చెబుతున్నారు. 11 గంటలకు తన కుమార్తెతో ఫోన్ మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కేకలు, ఆరుపులు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా తగవు తీర్చు తున్నారేమో అనుకున్నామంటున్నారు. అసలు అర్ధరాత్రి ఏం జరిగింది? గోడవ పడింది ఎవరు? అన్నది మిస్టరీగా మారింది. ప్రసాద్ తలకు గాయమైంది. తలను గోడకు కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. విగత జీవుడిగా పడి ఉన్న ప్రసాద్ ఒంటిపై నూలు పోగు కూడా లేదు.
గత కొనేళ్లుగా ఒంటరిగానే...
ప్రసాద్ కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. భార్య శ్రీకళ జంగారెడ్డిగూడెంలో ప్రైవేటు కళాశాలలో పనిచేస్తూ పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఐదారేళ్ల కిత్రం తల్లి మృతి చెందడంతో ప్రసాద్ హోటల్‌లో భోజనం చేస్తున్నారని చెబుతున్నారు. కుమారుడు హనురామ్ ప్రస్తుతం రాజానగరం గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కుమార్తె సుప్రజ సీఆర్ రెడ్డి కళాశాలలో ఫార్మ్–డి చదువుతుంది. ప్రసాద్‌కి భార్యకు మధ్య అంతగా సఖ్యత ఉండేది కాదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment