దోపిడీ పాలనను సాగనంపుదాం | DOPIDI PAALANANU SAAGANAMPUDAM | Sakshi
Sakshi News home page

దోపిడీ పాలనను సాగనంపుదాం

Published Fri, Jun 2 2017 1:51 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

దోపిడీ పాలనను సాగనంపుదాం - Sakshi

దోపిడీ పాలనను సాగనంపుదాం

కొవ్వూరు : టీడీపీ మంత్రులు, నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. స్థానిక పరిమి రామారాయుడు రత్తమ్మ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశా రు. సంస్థాగతంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బ లోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సా గిస్తున్న రాక్షసపాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అవి నీతికి పాల్పడుతూ ప్రజాధనం దోచుకుతింటున్నారన్నారు. అక్రమ సంపాదనను రాబోయే ఎన్నికల్లో ఖర్చుచేయాలంటూ చంద్రబాబు అవి నీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకు అందించారని, చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా ముఠాలుగా మారారని ధ్వజమెత్తారు. అసమర్థ మంత్రి పాలనలో నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరి చరణ్, బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, గురుజు బాలమురళీకృష్ణ, చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, లకంసాని శ్రీనివాసరావు, చీర్ల బ్రహ్మానందం తదితరులు వివిధ తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, నియోజకవర్గ కన్వీనర్‌లు పుప్పాల వాసుబాబు, ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాసరావు, దయాల నవీన్‌బాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, నాయకులు పోతుల రామతిరుపతిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, చాగల్లు, తాళ్లపూడి మండల అధ్యక్షులు కొఠారు అశోక్‌బాబు, కుంటముక్కల కేశవ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
కలిసికట్టుగా పనిచేద్దాం
పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రానున్న రెండేళ్లలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేంతవరకూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. చాగల్లు షుగర్‌ ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. ఇసుక అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇసుక మాఫియా హత్యలకు తెగబడుతోందని, టీడీపీ నాయకులు సొంత పార్టీ నాయకులను హత్య చేయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తాగునీరు దొరక్కపోయినా మద్యం ఎరులై పారుతోందని విమర్శించారు.
కోట్లు ఎలా వచ్చాయి
దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ.25 లక్షలు అప్పు చేసిన మంత్రి  ఇప్పుడు కోట్లు ఎలా సంపాందించారో చెప్పాలని  ప్రశ్నించారు. 
అబద్దపు హామీలతో అధికారంలోకి..
అబద్దపు హామీలతో అన్ని వర్గాలకు మోసగించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళుళం జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్యే మోషేన్‌రాజు విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సాఆర్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య విమర్శించారు.
అన్నదాతల ఆత్మహత్యలు పట్టవా..
రుణమాఫీ అమలు కాకపోవడం, పం టలకు గిట్టుబాటు ధరల లభించక అ న్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు మేకా శేషుబాబు విమర్శించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల సం ఖ్య తక్కువ సంఖ్యలో ఉందన్న నెపంతో ప్రభుత్వం హాస్టళ్లను మూసివేస్తోం దని ఆరోపించారు.
ఇది మాఫియా పాలన
ఎన్‌టీఆర్‌ పాలన ఒక పద్ధతిగా ఉండేదని, చంద్రబాబు హయాం మాఫియా పాలనలా తయారైందని వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు ఆరోపించారు. టీడీపీ కు టుంబ పాలనలా తయారైందని విమర్శించారు. పార్టీలో యువత భాగస్వామ్యం పెరగాలని సూచించారు. తెలు గుదేశం మహానాడు చంద్రబాబు భజ న కోసం ఏర్పాటు చేసుకున్న జాతర అని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ విమర్శించారు.
 
తీర్మానాలిలా..
పింఛన్లు, ఇళ్ల ఎంపికలో లబ్ధిదారులకు ప్రాధాన్యం, జన్మభూమి కమిటీల రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, టీడీపీ నాయకుల దోపిడీని అరికట్టడం, మద్యం, ఇసుక, మట్టి మాఫియాల ఆగడాలను అడ్డుకోవడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించడం, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల సక్రమ అమలు, తాగు, సాగునీటి సమస్యలు తీర్చడం, వ్యవసాయ ఉత్పత్పులకు కనీస మద్ధతు ధర కల్పించడం వంటి తీర్మానాలు ఆమెదించారు.  దళిత, గిరిజన సంక్షేమానికి పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు, కొవ్వూరు గోష్పాదక్షేత్రం అభివృద్ధికి నిధుల కేటా యింపు, కొవ్వూరు–భద్రాచలం రైల్వేలై¯ŒS నిర్మాణానికి చర్యలు, చాగల్లు జైపూర్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ తెరిపిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్లీనరీలో తీర్మానించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement