ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
Published Sun, Oct 2 2016 2:13 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
కొవ్వూరు: పట్టణానికి చెందిన సంగంరెడ్డి అర్జున్‌కుమార్ (17) అనే యువకుడు శనివారం సా యంత్రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసుల వేధింపులు కారణమని బంధువులు పోలీసుస్టేషన్ వద్ద రాత్రి ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న అర్జున్‌ను ఓ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గం టల వరకు విచారణ చేసి విడిచిపెట్టారు. తర్వా త ఇంటికి వచ్చిన అర్జున్ ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా విచారణ పేరుతో కిలా డి శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని భీష్మించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. తమకు న్యాయం జరిగే వరకూ మునిసిపల్ పారిశుధ్య కార్మికులెవరూ విధులకు హాజరుకాబోమని ప్రకటించారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుం టున్నానని అర్జున్ సూసైడ్ నోట్ రాశాడు.
Advertisement
Advertisement