ఉరేసుకుని యువతి ఆత్మహత్య
Published Thu, Jul 13 2017 12:22 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
వెల్దుర్తి(కృష్ణగిరి) : రత్నపల్లెలో బుధవారం తెల్లవారుజామున వెంకటలక్ష్మి(16) అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద వెంకటపుల్లయ్య, మద్దమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలు వివాహం కాగా 3వ కుమార్తె అయిన వెంకటలక్ష్మి తల్లితో కలిసి కూలీ పనులకెళ్లేది. అయితే తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడమేకాక తరచూ తల్లిని దూషించేవాడు. తన తల్లిని తిట్టొద్దంటూ పలుమార్లు తండ్రిని కోరింది. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పురాలేదు. ఈక్రమంలో మనస్థాపానికి గురైన వెంకటలక్ష్మి అందరూ నిద్రిస్తున్న సమయంలో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగేష్ తెలిపారు.
Advertisement
Advertisement