విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఆత్మహత్య
Published Mon, Aug 28 2017 10:25 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పత్తికొండటౌన్: స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న మంగలి నాగేష్, నాగమ్మ దంపతుల కుమారుడు ఎం.ఉరుకుందు(12) కడుపునొప్పి తాళలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు.. నాగేష్, నాగమ్మ దంపతులకు కుమార్తె, ఒక కుమారుడు కాగా కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు స్థానిక సెయింట్‌జోసెఫ్ ఉన్నత పాఠశాలలో 7వతరగతి చదువుతున్నాడు. ఉరుకుందు ఉదయం స్కూల్‌కు వెళ్లమని చెప్పి, తండ్రి సెలూన్ షాపుకు వెళ్లగా, తల్లి కూలీ పనులకు వెళ్లింది.
తల్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో చుట్టు పక్కల వారి సహాయంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి సొమ్మసిల్లింది. కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పాఠశాల మదర్ అన్నాగ్రేస్, హెచ్‌ఎం సిస్టర్ అనూఫా, ఉపాధ్యాయులు, విద్యార్థులు మృతికి సంతాపం తెలిపి తల్లిదండ్రులను పరామర్శించారు. ఎస్‌ఐ బి.మధుసూదన్‌రావు మృతిపై విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ వివరించారు.
Advertisement
Advertisement