కొవ్వూరు వైస్సార్సీపీ అభ్యర్థి ఓటు తొలగింపు!
Published Sun, Mar 30 2014 4:45 PM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం గందరగోళం సృష్టించింది. టీడీపీతో కమిషనర్ కుమ్మకై వైఎస్ఆర్సీపీ ఛైర్మన్ అభ్యర్ధి హరిచరణ్ దంపతుల ఓట్లు తొలగించడం వివాదస్పదమైంది. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఓట్లు తొలగించడంపై అభ్యర్థి హరిచరణ్ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
అభ్యర్థి ఓట్ల తొలగింపు వ్యవహారంపై హైడ్రామా నాలుగు గంటలు నడించింది. హరిచరణ్ ఆందోళన చేపట్టడంతో కమిషనర్ చేసింది తప్పేనంటూ ఆర్డీవో వివరణ ఇచ్చారు. కమిషనర్ తీరుపై జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని ఆర్డీవో వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హరిచరణ్ దంపతులకు ఆర్టీవో అనుమతివ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది.
Advertisement
Advertisement