
ట్రాక్‌పై నిలిచిన లారీ...ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు
పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు రైల్వేగేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై లారీ సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో ఆదివారం సాయంత్రం పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విజయవాడ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే పలు రైళ్లను చాగల్లు రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. కొరమండల్ ఎక్స్‌ప్రెస్, కొణార్క్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కొస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లారీని ట్రాక్‌పై తొలగించి రైళ్లను పునరుద్ధరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.