పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది.
కోవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులపై వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళ వ్యాటర్ ట్యాంకర్ కింద ఇరుక్కుపోయింది.
దాంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. గోదావరి నదీ పుష్కరాలు నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతో గోష్పాద కేత్రానికి భక్తులు శనివారం పోటెత్తారు.