నిడదవోలు.. కొత్త ‘గోలు’ | nidadavolu history | Sakshi
Sakshi News home page

నిడదవోలు.. కొత్త ‘గోలు’

Published Sat, Apr 5 2014 12:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

nidadavolu history

నిడదవోలు, న్యూస్‌లైన్ : దేశంలోని అత్యంత ప్రాచీన పట్టణాల్లో ఒకటిగా నిడదవోలుకు పేరుంది. వేంగి చాళుక్యుల కాలంలో జలదుర్గంగా భాసిల్లిన నిడదవోలును కేంద్రంగా చేసుకుని 14వ శతాబ్ధ కాలంలో అనవేమారెడ్డి అనే రాజు పరిపాలన సాగించాడు. కాకతీయ రాజులతో సంబంధం అందుకున్న ప్రాంతమిది.
 
రాష్ట్రకూటులతో జరిగిన యుద్ధంలో రెండో చాళుక్య భీముడు విజయసారధిగా ఈ నగరంలోనే పేరొం దాడు. ఇంతటి ప్రాచీన చరిత్ర గల నిడదవోలుకు చెప్పుకోదగిన రాజకీయ చరిత్ర లేకపోవడం విశేషం. పునర్విభజన నేపథ్యంలో 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు నిడదవోలు పట్టణంతోపాటు  నిడదవోలు మండలంలోని 16 గ్రామాలు కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. మిగిలిన 6 మెట్ట గ్రామాలు గోపాలపురం నియోజకవర్గంలో ఉండేవి.
 
తణుకు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం,  పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలాలతోపాటు నిడదవోలు పట్టణం, నిడదవోలు మండలాన్ని కలిపి నిడదవోలు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 56 గ్రామాలతో విస్తరించిన ఈ నియోజకవర్గ పరిధిలో 196 పోలింగ్ కేంద్రాలు ఉన్నారుు. 2009లో జరిగిన తొలి ఎన్నికలలో ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి శేషారావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు.
 
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీఎస్ నాయుడు, ప్రజారాజ్యం పార్టీ తరఫున రుద్రరాజు సత్యనారాయణరాజు (జెడ్ రాజు) పోటీ చేశారు. త్రిముఖ పోరులో శేషారావుకు 51,680 ఓట్లు లభించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీఎస్ నాయుడుకు 45,914 ఓట్లు, పీఆర్పీ అభ్యర్థి జెడ్ రాజుకు 44,511 ఓట్లు పోలయ్యూరుు. సమీప ప్రత్యర్థి జీఎస్ నాయుడుపై శేషారావు 5,766 ఓట్ల ఆధిక్యత సాధించారు.
 
ఇదీ ప్రస్తుత పరిస్థితి
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ని నడిపించిన జీఎస్ రావు వంటి ఉద్దండులున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అరుుపోరుుంది. నిడదవోలు పట్టణానికి చెందిన పీసీసీ కార్యదర్శి కామిశెట్టి సత్యనారాయణ మాత్రమే ఆ పార్టీకి దిక్కుగా ఉన్నా రు. ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఇక్కడినుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న బూరుగుపల్లి శేషారావు టీడీపీకి చెందిన వారే అయినప్పటికీ పార్టీని నడిపించే వ్యక్తి లేరనే అభిప్రాయం శ్రేణుల్లో నెలకొంది.నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోవడం ఆ పార్టీకి మైనస్‌గా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు, ఆయన తనయుడు జీఎస్ నాయుడు వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీకి మరిం త బలం చేకూరింది.
 
నిడదవోలుతోపాటు పెరవలి మండలాల్లో మంచి పట్టున్న జీఎస్ రావు వంటి పెద్దలు వైఎస్సార్ సీపీలో చేరడం టీడీపీ వర్గాల్లో కలవరం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ తనదైన శైలిలో పట్టణంతోపాటు నిడదవోలు, ఉం డ్రాజవరం, పెరవలి మండలాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement