burugupalli sesha rao
-
నిడదవోలు.. టీడీపీలో విభేదాలు
సాక్షి, నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నా యి. సీటు కోసం అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. దీంతో సీటు కేటాయింపును పార్టీ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. 2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ను బూరుగుపల్లి శేషారావుకు ఇప్పించడంలో అతడి అన్న బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వెన్నుదన్నుగా నిలిచారు. అయితే అనంతరం కుటుంబంలో చెలరేగిన తగాదాలు రోడ్డుకెక్కడంతో ఈసారి వేణుగోపాలకృష్ణ కూడా బరి లో నిలిచారు. నిడదవోలు సీటును తనకే టాయించాలని వేణుగోపాలకృష్ణ పట్టుబట్టడం, సిట్టింగ్ స్థానాన్ని మరలా తనకే ఇవ్వాలని శేషారావు భీష్మించడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తొలిసారి టికెట్ కోసం రోడ్డెక్కడం కలకలం రేపింది. వీరితో పాటు కుందుల సత్యనారాయణ కూడా సీటు ఆశించడంతో నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా మారింది. ఇటీవల అమరావతిలో జరిగిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలోనూ శేషారావుకు సీటు కేటాయించవద్దని కుందుల వర్గం ప్లకార్డులు ప్రదర్శించడం వి వాదాస్పదమైంది. ఆయా వర్గాలు అమరావతిలో మకాం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పలు విద్యాసంస్థల యాజమాన్యాలను అమరావతికి తీసుకువెళ్లి వేణుగోపాలకృష్ణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. టికెట్ ఎవరికి కేటాయిస్తే ఎలాంటి పరి ణామాలు ఎదురవుతాయోననే ఆలోచనలో నిడదవోలు పంచాయితీ అధిష్టానానికి పెను సవాల్‌గా మారింది. చివరిసారిగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే శేషారావు, వేణుగోపాలకృష్ణను సీటు ఎవరికి కావాలో తేల్చుకోమని అధిష్టానం చెప్పింది. అయితే వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరగకపోవడంతో విభేదాలు కొలిక్కిరాలేదు. ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్నా సీటు వ్యవహారంలో సస్పెన్షన్ వీడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు వైపే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
సీఎం ఇంటివద్దే ‘తమ్ముళ్ల’ తన్నులాట
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో ముఠా కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దే తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఘర్షణకు దిగారు. అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకుల సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు, నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కేఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావులకు సీట్లు ఇవ్వొద్దని అక్కడి క్యాడర్, స్థానిక నాయకత్వం ఆందోళనకు దిగింది. నిడదవోలు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటిస్తే టీడీపీ గోదారిలో కలిసిపోయినట్లేనంటూ ఆయన్ను వ్యతిరేకించే నాయకులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నాయకులు అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. పలువురు నేతలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇసుక క్వారీల్లో బూరుగుపల్లి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, గ్రామాల్లో తమను పట్టించుకోకుండా అణచివేశారని పలువురు ఆరోపించారు. సమావేశానంతరం వారంతా టెంట్లనుంచి బయటికొచ్చి బూరుగుపల్లికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారిని ఆపేందుకు పరిశీలకులుగా ఉన్న పార్టీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమావేశంలో జరిగిన విషయాల్ని చంద్రబాబుకు వివరిస్తామని, ప్రశాంతంగా ఉండాలని సర్దిచెప్పినా అసమ్మతివర్గం వినిపించుకోలేదు. మంత్రి జవహర్‌ను నిలదీసిన వైరివర్గం.. మరోవైపు కొవ్వూరు నియోజకవర్గంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి కేఎస్ జవహర్ ఎదుటే ఆయన అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. పరిశీలకుల ఎదుటే జవహర్‌ను నిలదీయడమేగాక.. అవినీతికి పరాకాష్టగా మారిన ఆయనకు సీటిస్తే ఓడిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. ఇందుకు జవహర్ అనుకూల వర్గం అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగి రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. పరిశీలకులు ఆపినా పట్టించుకోని కార్యకర్తలు జవహర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జవహర్ డౌన్ డౌన్, అవినీతిపరుడు జవహర్‌కు సీటివ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. రెండు నియోజకవర్గాల సమావేశాలు రసాభాసగా మారడంతో సీఎం నివాస ప్రాంతం వద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేసిన వారిని అడ్డుకుని దూరంగా పంపించివేశారు. కొవ్వూరు నుంచే పోటీ చేస్తా: జవహర్ సమావేశానంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని, కొందరు నాయకులు అహంకారంతో కావాలని తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
‘పశ్చిమ’లో అసంతృప్త రాగం
* పదవుల్లో ప్రాధాన్యం లేదని టీడీపీ నేతల విమర్శ ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా ఈ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీతో కలిసి జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. టీడీపీ అధికారంలోకి రావడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు కీలకమయ్యాయనేది కాదనలేని వాస్తవం. దీంతో టీడీపీ శ్రేణులు తమ పంట పండినట్టేనని భావించారు. మంత్రి పదవుల్లోను, ప్రభుత్వ పోస్టుల్లోను తవుకు కీలకశాఖలు దక్కుతాయని ఆశపడ్డారు. కానీ ఆశించిన వారిని అందలమెక్కించని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహారశైలితో జిల్లా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి రాగం మొదలవుతోంది. జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయించినా శాఖల కేటాయింపు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. చింతలపూడి ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పీతల సుజాత మంత్రి పదవి ఇచ్చి గనులు, భూగర్భ, స్త్రీ శిశుసంక్షేమశాఖలు కట్టబెట్టినా మిత్రపక్ష బీజేపీ తరఫున తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావుకు ఎవరూ తీసుకోవడానికి ముందుకురాని దేవాదాయశాఖను అప్పగించారు. బీజేపీకి ఇచ్చిన పదవిని మినహాయిస్తే తమకు ఒకే మంత్రి పదవితో సరిపుచ్చడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీకి మొదటి నుంచి కొమ్ముకాస్తున్న సామాజికవర్గానికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తాజాగా ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టి సహాయమంత్రి హోదా ఇచ్చారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా కేవలం శాసనసభ వ్యవహారాలకే పరిమితమయ్యే విప్ పదవిని కట్టబెట్టడంపైన కూడా టీడీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. సామాజికవర్గాల సమతూకంలో మరో రెండు వర్గాలకు పదవులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. డెల్టా ప్రాంతంలో ఈసారి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బలమైన రెండు సామాజిక వర్గాలకు ఏం పదవులు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఆచంట ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పోలవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎస్టీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు తొలివిడతలో అవకాశం రాకపోవడంతో ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు. కీలక శాఖలన్నీ పొరుగు జిల్లాలకే జిల్లా మొత్తం స్వీప్ చేసినా పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు పదవుల పంపకంలో సరైన ప్రాధాన్యత రాలేదన్న వాదనలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పొరుగు జిల్లా నేతలకు వచ్చిన పదవులతో పోల్చిచూస్తున్న రాజకీయ విశ్లేషకులు ఈ వాదనలను ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లకు గాను 14 సీట్లు గెలిచిన టీడీపీ నేతలకు పదవుల పంపకంలో అగ్రతాంబూలం లభించింది. ఆ జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవితో కీలకమైన హోంశాఖ, ఎమ్మెల్సీ కోటాలో యనమల రామకృష్ణుకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖ అప్పగించారు. ఇటు కృష్ణాజిల్లా చూస్తే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలకమైన భారీ, మధ్యతరహా నీటిపారుదలశాఖ, కొల్లు రవీంద్రకు ఎక్సైజ్‌శాఖ కట్టబెట్టారు. అదే జిల్లా నుంచి బీజేపీ తరఫున గెలిచిన కామినేని శ్రీనివాస్‌ను వైద్య ఆరోగ్యశాఖ వరించింది. అంతెందుకు.. 17 నియోజకవర్గాల్లో 12 గెలిచిన గుంటూరు జిల్లానూ కీలక పదవులు వరించాయి. ఆ జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యవసాయశాఖ, రావెల కిషోర్‌బాబుకు సాంఘికసంక్షేమ శాఖ ఇవ్వగా, ఏకంగా అత్యున్నతమైన స్పీకర్ పదవిని కూడా ఆ జిల్లాకే చెందిన కోడెల శివప్రసాదరావుకు అప్పగించారు. పొరుగు జిల్లాలకు వెల్లువలా పదవుల పంపకం చేస్తున్న టీడీపీ అధినాయకత్వం ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు ప్రాధ్యాన్యత ఇవ్వకపోవడంపై పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. -
నిడదవోలు.. కొత్త ‘గోలు’
నిడదవోలు, న్యూస్‌లైన్ : దేశంలోని అత్యంత ప్రాచీన పట్టణాల్లో ఒకటిగా నిడదవోలుకు పేరుంది. వేంగి చాళుక్యుల కాలంలో జలదుర్గంగా భాసిల్లిన నిడదవోలును కేంద్రంగా చేసుకుని 14వ శతాబ్ధ కాలంలో అనవేమారెడ్డి అనే రాజు పరిపాలన సాగించాడు. కాకతీయ రాజులతో సంబంధం అందుకున్న ప్రాంతమిది. రాష్ట్రకూటులతో జరిగిన యుద్ధంలో రెండో చాళుక్య భీముడు విజయసారధిగా ఈ నగరంలోనే పేరొం దాడు. ఇంతటి ప్రాచీన చరిత్ర గల నిడదవోలుకు చెప్పుకోదగిన రాజకీయ చరిత్ర లేకపోవడం విశేషం. పునర్విభజన నేపథ్యంలో 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు నిడదవోలు పట్టణంతోపాటు నిడదవోలు మండలంలోని 16 గ్రామాలు కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. మిగిలిన 6 మెట్ట గ్రామాలు గోపాలపురం నియోజకవర్గంలో ఉండేవి. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం, పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలాలతోపాటు నిడదవోలు పట్టణం, నిడదవోలు మండలాన్ని కలిపి నిడదవోలు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 56 గ్రామాలతో విస్తరించిన ఈ నియోజకవర్గ పరిధిలో 196 పోలింగ్ కేంద్రాలు ఉన్నారుు. 2009లో జరిగిన తొలి ఎన్నికలలో ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి శేషారావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీఎస్ నాయుడు, ప్రజారాజ్యం పార్టీ తరఫున రుద్రరాజు సత్యనారాయణరాజు (జెడ్ రాజు) పోటీ చేశారు. త్రిముఖ పోరులో శేషారావుకు 51,680 ఓట్లు లభించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీఎస్ నాయుడుకు 45,914 ఓట్లు, పీఆర్పీ అభ్యర్థి జెడ్ రాజుకు 44,511 ఓట్లు పోలయ్యూరుు. సమీప ప్రత్యర్థి జీఎస్ నాయుడుపై శేషారావు 5,766 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ని నడిపించిన జీఎస్ రావు వంటి ఉద్దండులున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అరుుపోరుుంది. నిడదవోలు పట్టణానికి చెందిన పీసీసీ కార్యదర్శి కామిశెట్టి సత్యనారాయణ మాత్రమే ఆ పార్టీకి దిక్కుగా ఉన్నా రు. ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక్కడినుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న బూరుగుపల్లి శేషారావు టీడీపీకి చెందిన వారే అయినప్పటికీ పార్టీని నడిపించే వ్యక్తి లేరనే అభిప్రాయం శ్రేణుల్లో నెలకొంది.నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోవడం ఆ పార్టీకి మైనస్‌గా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు, ఆయన తనయుడు జీఎస్ నాయుడు వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీకి మరిం త బలం చేకూరింది. నిడదవోలుతోపాటు పెరవలి మండలాల్లో మంచి పట్టున్న జీఎస్ రావు వంటి పెద్దలు వైఎస్సార్ సీపీలో చేరడం టీడీపీ వర్గాల్లో కలవరం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ తనదైన శైలిలో పట్టణంతోపాటు నిడదవోలు, ఉం డ్రాజవరం, పెరవలి మండలాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు.