CM Jagan Help To 2 Years Old Diana Shanthi For Medical Treatment In Nidadavolu - Sakshi
Sakshi News home page

చిన్నారి వైద్యం కోసం ఉదారంగా స్పందించిన సీఎం జగన్‌

Published Wed, Mar 1 2023 6:23 PM | Last Updated on Wed, Mar 1 2023 7:08 PM

CM Jagan Help To 2 year Old Diana Shanthi For Health Nidadavolu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: చిన్నారి వైద్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారంగా స్పందించారు.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి ‘స్పైనల్‌ మస్క్యులర్‌‘ వ్యాధితో బాధపడుతోంది. జనవరి 3న సీఎం జగన్‌ రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా కలిసి తగిన సహాయం అందించాల్సినదిగా విజ్ఞప్తి చేశారు. డయానా శాంతి ఆరోగ్య పరిస్థితి విని స్పందించిన సీఎం.. ఎయిమ్స్‌లో తగిన వైద్య సేవలు అందచేసేందుకు చొరవ తీసుకున్నారు.

పాప మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని  ఆదేశించినట్లు లెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. అంతేగాక నెలకూ రూ.10 వేల పెన్షన్, అవుట్ సోర్సింగ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని కలెక్టర్  వివరించారు.

కాగా, ముఖ్యమంత్రి బుధవారం నిడదవోలు వచ్చిన సందర్భంగా డయానా తల్లి సూర్యకుమారి వైఎస్‌ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అయితే తన కుమార్తె వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడం చాలా ఖర్చుతో కూడుకున్నట్లు సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడానికి అవసరమైన చేయూతను అందచేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.

యూఎస్‌ఏ నుంచి పాప వైద్యానికి సంబంధించి రిస్డిప్లం  (risdiplam) IT gene therapy) ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈ ఇంజెక్షన్ సుమారు రూ.14 కోట్ల రూపాయల ఖరీదు ఉన్న నేపథ్యంలో అందులో భాగంగా కొద్ది నెలల పాటు పాప వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉందన్నారు. తగిన వైద్య సేవలు పొందేందుకు వీలుగా న్యూఢిల్లీకి వెళ్లి రావడం కోసం విమాన ప్రయాణం ఖర్చులు, వసతి తదితర ఖర్చుల తగిన ఆర్థిక సాయానికి సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మాధవీలత వెల్లడించారు.
చదవండి: ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement