నిడదవోలు: జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్ ప్రతిభా పోటీల్లో ఏపీలలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి సత్తా చాటింది. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అంశాల్లో ఆన్‌లైన్‌లో మూడు రౌండ్లలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో 82 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పరీక్షల్లో 14 పాయింట్లతో కైవల్యరెడ్డి ద్వితీయ స్థానం సాధించి, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ పొందింది.
Comments
Please login to add a commentAdd a comment