పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని మాజెర్‌హత్ ఏరియాలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్ప కూలింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ ఘటనతో కొన్ని వాహనాలు ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయాయి. వీరిని రక్షించేందుకు 10 రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లై ఓవర్ పూర్తిగా కూలిపోయే అవకాశం ఉన్నందున సమీపంలోని ఇళ్లను కూడా ఖాళీ చేయిస్తున్నారు.
Published Tue, Sep 4 2018 6:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement