అట్లాంటాలో భారీ అగ్ని ప్రమాదం
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓవర్ పాస్ బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమవ్వగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక గంటకు పైగా మంటలు ఎగిసిపడ్డాయని అట్లాంటా జర్నర్ కానిస్టుట్యూషన్ పేర్కొంది. ఈ ప్రమాదం పీడ్మొంట్ రోడ్ సమీపంలోని నార్త్‌బౌండ్‌అండర్ ఐ-85 బ్రిడ్జిపై చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా దట్టమై నల్లని పొగలతో కమ్ముకుంది. పక్క బ్రిడ్జిలకు మంటలు వ్యాపించలేదని, మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి 7 గంటల సమయంలో బ్రిడ్జి పడిపోయిందని అధికారులు వెల్లడించారు. తీవ్రవాదులు చేసిన పనిగా అనుకోవడంలేదని జార్జీయా పోలీసు అధికారి మార్క్‌పెర్రీ మీడియాకు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని విచారిస్తున్నామన్నారు. బ్రిడ్జి కూలిపోవడంతో వాహనాదారులకు ప్రత్యామ్నయ మార్గాలను సూచించామన్నారు.. ఘటన స్ధలిలో కొన్నిపీవీస్ వస్తువులు లభించాయని పూర్తి వివారలు శనివారం ఉదయంలోపు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.