అయ్యో! బ్రిడ్జి కొట్టుకుపోయింది.. | Bridge Collapsed Due To Floods In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అయ్యో! బ్రిడ్జి కొట్టుకుపోయింది..

Published Fri, Sep 13 2019 4:31 PM | Last Updated on Fri, Sep 13 2019 6:14 PM

Bridge Collapsed Due To Floods In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో భీభత్సాన్ని సృష్టించాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో మాడుగుల మండలంలోని బోయితేలి రహదారిపై గల సూరిమేట్ట బ్రిడ్జి శుక్రవారం కొట్టుకుపోయింది. దీంతో వంద గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చింతపల్లి, పాడేరు పరిసరాల్లోనూ మూడు రోజులుగా వానలు దండిగా పడటంతో మాడుగుల మండలం మద్ది గురువు, హుకుంపేట మండలం పెద గురువు వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వరదల ధాటికి ముంచుంగ్‌ ఫుట్‌ మండలంలో లక్ష్మీపురం వద్ద గెడ్డ కొట్టుకుపోయింది. అటు బొడ కొండమ్మ ఆలయం వద్ద రహదారికి అడ్డంగా బండరాళ్లు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడగా స్థానికులే వాటిని తొలగించి, తిరిగి రహదారిని పునరిద్ధరించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement